ఈ అమ్మ ప్రేమ.. అందరి కోసం!


Tue,March 19, 2019 01:06 AM

Raj-Laxmi
ఆడిపాడే వయసులో 8 యేండ్ల కుమారుడికి మూర్ఛ వచ్చింది. ఆ క్షణంలో ఏవో సపర్యలు చేసి మామూలు స్థితికి తీసుకొచ్చింది ఆ తల్లి. మళ్లీ మూర్ఛవస్తే.. ఏం చెయ్యాలి? అనే ప్రశ్నే.. ఆ తల్లితో ఓ నూతన ఆవిష్కరణ చేయించింది.


అసోంకు చెందిన ఈ మహిళ పేరు రాజ్‌లక్ష్మీ బోర్తాకర్. ఐటీ ఉద్యోగురాలైన ఈమె హెల్త్ ప్రొడక్ట్స్ ఇన్నోవేటర్‌గా పేరుగాంచింది. ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నది. తన ఎనిమిదేండ్ల కొడుకు తేజస్‌కు మూర్ఛవ్యాధి వచ్చింది. ఆ తర్వాత కొడుకుపై ఉన్న ప్రేమతో ఏదైనా కనిపెట్టాలని నిర్ణయించుకుంది రాజ్‌లక్ష్మీ. తనకు తెలిసిన ఐటీ ఇంజినీర్లు, డాటా సైంటిస్ట్‌లు, డెవలపర్స్, మెడికల్ రీసెర్చర్లను ఓ బృందంగా ఏర్పాటు చేసింది. వారితో మూర్ఛవ్యాధిని గుర్తించే ఓ పరికరాన్ని రూపొందించింది. బైక్ రైడింగ్ హ్యాండ్ గ్లౌజ్ మాదిరిగా ఉండే ఈ పరికరం పేరు టీజయ్. ఈ పరికరం చేతికి ధరించిన వారికి మూర్ఛవ్యాధి వచ్చే సూచనలు ముందే తెలుస్తుంది. శరీరంలో ఆ వ్యాధి ప్రస్తుత తీవ్రత తెలిసేలా, క్రమంగా వ్యాధి నయం చేసేలా దీన్ని రూపొందించారు. బెంగళూర్ నిమ్‌హాన్స్ ఆస్పత్రిలో 120 మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ఈ పరికరం అమర్చి మూర్ఛ తీవ్రతను తెలుసుకున్నారు. దీని సహాయంతో తన కొడుకు తేజస్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది రాజ్‌లక్ష్మీ. అదే స్ఫూర్తితో మన దేశంలో మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఎంతోమందికి ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నది. తన నూతన ఆవిష్కరణతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నది. ఎన్నో అవార్డులు, రివార్డులు రాజ్‌లక్ష్మీని వరించాయి. వీటిల్లో యునైటెడ్ నేషన్స్, భారత ప్రభుత్వం అందించే డిజిటల్ ఇండియా చాలెంజ్ అవార్డులు ఉన్నాయి. ఈ పరికరాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలనే లక్ష్యంతో టెర్రాబ్లూ ఎక్స్‌టీ అనే కంపెనీని స్థాపించి సీఈఓగా పనిచేస్తున్నది రాజ్‌లక్ష్మీ.
Raj-Laxmi1

765
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles