ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో..


Sat,January 26, 2019 12:37 AM

proparty
టీబీఎఫ్, ఎస్‌బీఐ ఆధ్వర్యంలో వరంగల్ హైవేలో ప్రాపర్టీ ప్రదర్శన.. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో..


తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా కలిసి ఉప్పల్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో బోడుప్పల్ సర్కిల్‌లోని బిగ్‌బజార్ ఎదురుగా మహారాజా ఫంక్షన్ హాల్‌లో జరగనున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో.. స్టాళ్లను ఏర్పాటు చేయడానికి 23 సంస్థ లు ముందుకొచ్చాయి. ఈస్ట్ హైదరాబాద్‌లోని పలు సంస్థలు విక్రయించే అపార్టుమెంట్లు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ స్థలాలకు సంబంధించిన సమాచారం ఈ ప్రదర్శనలో లభిస్తుందని టీబీఎఫ్ జనరల్ సెక్రెటరీ జక్కా వెంకట్‌రెడ్డి తెలిపారు. హరిహరా, ఎస్‌ఎన్ బిల్డర్స్, హెచ్‌వీ కన్‌స్ట్రక్షన్స్, ట్రై కలర్ ప్రాపర్టీస్, మై ఎన్‌వైర్, ఫుల్‌హౌజ్, ఏవీ కన్‌స్ట్రక్షన్స్ వంటివి స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. ఉప్పల్ మెట్రో డిపో, పోచారంలో ఐటీ పరిశ్రమ, ఎయిమ్స్, యాదాద్రి వంటి వాటిలో తూర్పు హైదరాబాద్ విశేషంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు.. తమకు నచ్చిన ప్లాట్లను ఎంచుకోవడానికిదే సరైన వేదిక అన్నారు. ప్రస్తుతం ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ప్రయత్నించేవారికి కావాల్సిన ప్రాజెక్టుల సమాచారం ఈ ప్రాపర్టీ షోకి విచ్చేస్తే లభిస్తాయన్నారు.


లుక్ ఈస్ట్..

తూర్పు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుందని, ఐటీ సంస్థల్ని ఈ ప్రాంతం వైపు ఆకర్షించేందుకు విడిగా లుక్ ఈస్ట్ పాలసీకి రూపకల్పన చేసిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇతర పట్టణాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తారని వెల్లడించారు. దీంతో, హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రదర్శనకు విచ్చేసి ఫ్లాటు కొనే వారికి ఎస్‌బీఐ రుణం మంజూరు చేస్తుందన్నారు.

304
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles