ఇవో రకం వింత పెండ్లిళ్లు


Thu,March 7, 2019 02:19 AM

DOG-WEDDING
హిందూ ఆచారం ప్రకారం వర్షాకాలంలో కప్పలకు పెండ్లి జరిపించి, ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయనే భావన. వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అలా చేస్తారు. అంతేకాదు యువతీ, యువకులకు త్వరగా పెండ్లి కాకపోతే వేపతచెట్టుకు రావిచెట్టుకు పెండ్లి చేస్తుంటారు. ఇటువంటి పెండ్లిళ్లను గురించి మాత్రమే ఇప్పటి వరకూ విని ఉంటాం. కానీ పెంపుడు జంతువులకు లక్షల రూపాయలు వెచ్చించి అత్యంత ఘనంగా వివాహం చేసి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు వాటి యజమానులు. ఈ వారం విశేషలో జంతువుల పెండ్లిళ్లపై ప్రత్యేక కథనం.


పాండాల పెండ్లి

pandas-wedding
ఆ జూలో రెండు పాండాలు పదేండ్ల నుంచి కలిసి జీవిస్తున్నాయి. 2005లో చైనాలోని ఓ జూలో నివసిస్తున్న రెండు పాండాలు ఎంతో స్నేహంగా ఉండడాన్ని గమనించిన జూ అధికారులు ఆ రెంటింటికీ పెండ్లి చేశారు. వివాహానికి ముందు అతిధులకు కూడా శుభలేఖలు పంపించారు. వాటిని అందుకున్న వారంతా ఆ రోజు జూకు చేరుకున్నారు. అందరూ వచ్చి వధూవరులైన పాండాలను ఆశీర్వదించారు.


కప్పల కల్యాణం

frogs-wedding
వర్షాలు కురువడం కోసం కప్పలకు పెండ్లి చేస్తుంటారు. కానీ ఈ పెండ్లి కూడా అదే ఉద్దేశంతో జరిపించారు ఆ గ్రామపెద్దలు. కాకపోతే కొంచెం వినూత్నంగా జరిపించారు. హిందూ సంప్రదాయంలో ఆడ,మగ కప్పలకు ఎంతో ఘనంగా వివాహం చేశారు. మాంగల్యధారణతో సహా ఎంతో సంబురంగా వాటికి పెండ్లి జరిపించారు. ఆడ కప్పకు సీత అని ,మగ కప్పకు రామ అని నామకరణం చేశారు. 2009లోపశ్చిమ బెంగాల్‌ల్లోని మధ్య బరగరి గ్రామంలో జరిగిన ఈ పెండ్లికి 3వేల మంది అతిధులుగా పాల్గొన్నారు.


కుందేళ్ల వివాహం

rabits-wedding
యూరప్‌లో 2010లో ఆడ,మగ కుందేళ్లకు అత్యంత ఘనంగా పెండ్లి జరిపించారు. రెండు కుందేళ్లకు పెండ్లి దుస్తులతో అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఓహేర్ అనే ఫాదర్ వాటికి అత్యంత వేడుకగా వివాహం నిర్వహించాడు. కల్యాణానికి హాజరైన అతిధులంతా ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వధూ,వరులైన కుందేళ్లకు తినిపించారు.పెండ్లిని తిలకించిన పెద్దలందరూ కుందేళ్లను ఆశీర్వదించారు.


చింపాంజీల పెండ్లి వేడుక

chimpanzees-wedding
చైనాలోని హెఫై నగరంలోని జూ పార్కులో ఆడ,మగ చింపాంజీలకు అంగరంగ వైభవంగా పెండ్లి చేశారు. చైనా సంప్రదాయంలో ఈ రెండు చింపాంజీలకు వివాహం జరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. పార్కులో పని చేసే అధికారులు, సిబ్బంది అందరూ కలిసి చింపాంజీలకు పెండ్లి జరిపించడమేకాకుండా రిషెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అతిథులతో నూతన వధూ,వరులిద్దరూ మద్యం సేవించి సంబురంగా తమ పెండ్లి వేడుకను జరుపుకున్నారు.


డాగ్స్ రిజిస్టర్ మ్యారేజ్

dogs
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో రెండు కుక్కలకు రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. రెండు కుక్కలను పెంచుకుంటున్న యజమాని జెన్నా మార్ల్బ్‌‌స వాటికి ఎంతో ఘనంగా వివాహం జరిపించింది. తానే స్వయంగా ఆడ, మగ కుక్కలకు వేర్వేరుగా పెండ్లి డ్రెస్‌ను తయారు చేసి వాటికి రిజిస్టర్ మ్యారేజ్ చేసింది. అందుకు సంబంధించిన పత్రాన్ని కూడా పొందింది.

పందుల పరిణయం

pigs-wedding
చైనాలోని తైవాన్‌లో 2007లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆడ, మగ రెండు పందులకు పెండ్లి జరిపించారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మనుషులకు జరిపించిన విధంగానే పందులకూ వివాహ వేడుకను నిర్వహించి, తమకు పందులపై ఉన్న ఆప్యాయతను చాటుకున్నారు. పాస్టర్ వచ్చి వాటి ఎదుట మీరిరువురూ ఈ రోజు నుంచి భార్యాభర్తలవుతున్నారని చెప్పగానే పెండ్లికి హాజరైన అతిధులంతా చప్పట్లు కొట్టారు. వధువు పంది హంగ్ పుపు, వరుడు మగ పంది ష్యుయ్ ఫు కోలకు పెండ్లి చేయడానికి ముందు దాని యజమాని ఫు వెన్ చున్ చాలా కషపడ్డాడు. ఫు వెన్ చున్ తన ఫారంలోని 11కిలోల బరువున్న ష్యుయ్ పు కో పందికి తగిన వధువు పంది కావలెనని సోషల్‌మీడియాలో ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత ష్యుయ్ ఫు కో కు సరిజోడి దొరకడంతో యజమానులు, అతిధుల నడుమ అంగరంగ వైభవంగా వాటికి పెండ్లి జరిపించారు.

-పసుపులేటి వెంకటేశ్వర రావు

1005
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles