ఇవి తోడుంటే సరి..


Fri,January 18, 2019 01:03 AM

టూరుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. వాటిని పాటిస్తే మన ప్రయాణం సురక్షింతంగా, ప్రశాతంగా, సజావుగా సాగుతుంది. ఈ ట్రావెట్ టిప్స్ ఫాలో అవండి. సుఖంగా ప్రయాణించండి.
healthy-travel-tips
-విదేశాలకు వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంది? అంటువ్యాధులు ప్రబలుతున్నాయా? ఆహారం ఎలాంటిది దొరుకుతుంది ఇంటి అంశాలను ట్రావెల్ ఏజెన్సీలను కానీ అఫీషియల్ సైట్స్‌లో కానీ చదివి తెలుసుకోవాలి.
-ప్రయాణాలు చేస్తున్నప్పుడు అలిసిపోతాం. ఒంట్లో శక్తి ఉండదు. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంటుంది. వేగంగా ఒంట్లో సత్తువ పెంచే ఆహార పదార్థ్ధాలను వెంటపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎండు ద్రాక్షలు, చెర్రీలు, డ్రై ఫ్రూట్స్ వంటివి బ్యాగ్‌లో ఉంచితే సరిపోతుంది.
-శరీరానికి మామూలుగానే నిద్ర అవసరం. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సాధారణంగానే నిద్రపట్టదు. గదిలో లైట్స్ ఆఫ్ చేసి, కళ్లకు గంతలు కట్టుకొని అయినా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడుతారు.
-ప్రథమ చికిత్స చేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంటపెట్టుకొని వెళ్లండి. బ్యాండేజ్, బర్నల్, సన్‌బర్న్‌క్రీమ్, జండూబామ్, వోలిన్, సానిటైజర్ వంటి వస్తువులను ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉండేలా చూసుకోండి.
-మీరు వెళ్లిన చోట దోమలు కుట్టి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి జ్వరాలు రావొచ్చు. ఫేస్‌మాస్క్‌లు, జాకెట్స్, గ్లౌజులు వెంట పెట్టుకోండి. ఆల్ అవుట్ కానీ, మస్కిటో కాయిల్ కానీ వెంటపెట్టుకోండి. నెత్తికి టోపి పెట్టడం మరిచిపోకండి.

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles