ఇలా చేద్దాం


Fri,February 22, 2019 01:15 AM

అటు పుణ్యం, ఇటు ఆరోగ్యం
Ila-cheddam
పుణ్యానికి పుణ్యం, పురుషార్థానికి పురుషార్థం అని పెద్దలు ఒకమాట అన్నారు. భక్తియోగంలో ఉపవాసానికి అత్యంత ప్రాధాన్యముంది. వారానికి ఒకరోజు నిత్యాహారాన్ని మానేసి ఉపవాసం ఉండడం వల్ల అటు పుణ్యంతోపాటు ఇటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని ప్రాచీన శాస్ర్తాలు చెప్పాయి. ఈ సంకష్ట హర చతుర్థి (నేడు) సందర్భంగా పొద్దంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చీకటి పడగానే చంద్రుడిని చూసి, ఆహారం సేవించడం ద్వారా మనకు తెలియకుండానే విఘ్నేశ్వరుని వ్రతం చేసిన వాళ్లమవుతాం. సంకష్ట హర చతుర్థి అంటేనే కష్టాలు తొలగించే రోజు అని అర్థం. ప్రతి సంవత్సరం ప్రతీ చాంద్ర మాసంలో రెండు చతుర్థి తిథులు వస్తాయి. పౌర్ణమి తర్వాతి నాలుగో రోజు కృష్ణ (బహుళ) పక్షంలో వచ్చే చవితిని సంకష్ట హర చతుర్థిగా జరుపుకుంటాం. ఈ లెక్కన ప్రతీ నెలలో ఒక సంకష్ట హర చతుర్థి వస్తుంది. కానీ, ఈ మాఘమాసంలో వచ్చే సంకష్ట హరి చతుర్థిని మరింత పుణ్యప్రదంగా పండితులు చెప్తారు. గణపతి ఆరాధనకు ఇది అత్యంత విశిష్ట దినం. ఈ రోజే ఈశ్వరుడు వినాయకునికి నిర్విఘ్నశక్తిని ప్రసాదించినట్లు పౌరాణిక కథనం.

498
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles