ఇలా చుట్టి..అలా మడతేస్తది!


Fri,April 19, 2019 01:55 AM

రెండు రోజులు ప్రయాణం అంటే లగేజ్ ఎంత ఉంటుందోనని భయపడతారు. మగవాళ్లయితే ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటారు. నలుగురున్న కుటుంబం వారం రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఇంకా ఎంత లగేజ్ అవసరం అవుతుంది? కేవలం ఒక సూట్‌కేస్ చాలు అంటున్నది ఓ మహిళ..
karen-edwards
ఒక్క రోజు ట్రిప్ అంటే ఆడవాళ్లకు కనీసం రెండు బ్యాగులైనా ఉంటాయనుకుంటారు. అలాంటిది వారంరోజులు కుటుంబం మొత్తానికి కావల్సినవన్నీ ఒక్క సూట్‌కేస్‌లో అంటే మాటలా. ఈమె పేరు కరెన్ ఎడ్వర్డ్స్. భర్త పేరు షాన్. కరెన్ నర్స్‌గా పనిచేస్తున్నది. వీరికి రెండు రోజులు సెలవులు దొరికినా దేశాలు చుట్టొస్తారు. ఇప్పటివరకూ థాయ్‌లాండ్ నుంచి ఆంటిగ్వా వరకూ ఉన్న దేశాలు చుట్టొచ్చారు. 2017లో వీరికి ఎస్మే పుట్టింది. మెటర్నిటీ లీవ్‌లో ఉన్న కరెన్ పదివారాలున్న పాపని తీసుకొని ట్రిప్‌కి వెళ్లింది. పాపతో కలిసి ఇప్పటివరకు 17 దేశాలు చూసింది కరెన్. తర్వాత కరెన్‌కి క్విన్ పుట్టాడు. నలుగురూ కలిసి మళ్లీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నలుగురు అయ్యారు. నలుగురు నాలుగు బ్యాగులు మోయడం కష్టం అనుకున్న కరెన్.. ఒక్క సూట్‌కేస్‌లోనే అన్నింటినీ సర్దేసింది. స్విమ్ సూట్స్, అందరికీ షూస్, సాక్సులు, చొక్కాలు, గౌన్లు, సన్‌గ్లాసెస్, టాప్స్, బొమ్మలు, పిల్లల పుస్తకాలు, టవల్స్, ఫస్ట్‌ఎయిడ్ కిట్, హైర్ బ్రష్, స్రైట్‌నర్, షవర్ జెల్, బాడీలోషన్ ఇలా 200 ఐటమ్స్‌లను 19 కి.గ్రా. వచ్చేలా ప్యాక్ చేసింది. దీన్ని వీడియో తీసి కరెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

255
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles