ఇలా ఎంతకాలం?


Thu,July 13, 2017 01:09 AM

మా బాబు వయసు 8 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయసు ఉన్నపుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్ టెస్ట్‌లో ప్రొటీన్ 3+ ఉంది. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స మొదలుపెట్టారు. నెల రోజులు మందులు వాడిన తర్వాత ప్రొటీన్ పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మందులు మానేస్తే తిరిగి సమస్య మొదలవుతున్నది. ఎక్కువ కాలం మందులు వాడితే మందుల వల్ల దుష్ప్రభావాలు ఎంత వరకు ఉంటాయి. ఈ సమస్య వల్ల భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా?
- రాకేష్, చింతకుంట

drsridarc
నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నపుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రొటీన్ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో మందుల వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. చాలామంది పిల్లల్లో ఈసమస్య 1 నుంచి 14 సంవత్సరాలు వచ్చే సరికి పూర్తిగా నయమవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు భయపడాల్సిన పనిలేదు.
drsridar

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles