ఇలా అయితే.. అది గుండెపోటే!


Wed,January 27, 2016 12:31 AM

ఛాతిలో నొప్పి రాగానే అది గుండెనొప్పే అని భయపడేవాళ్లు కొందరైతే ఏ అసిడిటీనో అని నిర్లక్ష్యం చేసేవాళ్లు మరికొందరు. గుండె నొప్పికి, ఇతర సమస్యలకు తేడా కనిపెట్టడం కొన్నిసార్లు కష్టం అయిపోతుంది. చాలా సందర్భాల్లో నొప్పిని పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే కన్నా అది గుండెనొప్పి కాదని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవడమే మంచిదని సూచిస్తారు వైద్యులు. అయితే గుండెలో సమస్య వల్ల వచ్చే నొప్పికి ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. కాని ఆందోళన వల్ల వీటి పట్ల పెద్దగా దృష్టి పెట్టం. అలాంటి లక్షణాలేవో ఒకసారి చూడండి.
ఛాతి మధ్యభాగంలో నొప్పి మొదలై పొట్టలోకి, చేతుల్లోకి, పక్క వైపుకి, వెనుకవైపుకి... ఇలా వ్యాపిస్తూ ఉంటుంది. గుండెపోటు రాకముందు గుండెనొప్పినే ఏంజైనా నొప్పి అంటారు. నొప్పి ఉన్నప్పుడు విపరీతమైన చెమట వస్తుంది. నడిచినా, ఏదైనా పనిచేసినా నొప్పి ఎక్కువ అవుతుంది. అరగంట గడిచినా నొప్పి తగ్గకపోతే అది కచ్చితంగా గుండెనొప్పే అని అనుమానించవచ్చు. సార్బిటాల్ మాత్ర నాలుక కింద పెట్టగానే నొప్పి తగ్గిపోతే అది గుండెనొప్పే అనుకోవాలి.
ఏంజైనా నొప్పి ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి వచ్చి చూపించుకుంటే హార్ట్‌ఫెయిల్యూర్‌ని నివారించవచ్చు.

1698
Tags

More News

VIRAL NEWS