ఇప్పట్నుంచే ప్రిపేరవ్వండి


Tue,January 22, 2019 10:42 PM

పరీక్షలు ఇప్పుడెక్కడివి అని తప్పుకునే ప్రయత్నం చేయకండి. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కనపెట్టి రెండు నెలల ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పరీక్షలు ఇప్పుడు లేవు కదా అని లైట్ తీసుకోకుండా ఈ ప్లాన్‌ను ఫాలో అవండి.
Preperations
-చక్కని టైమ్‌టేబుల్ ప్రిపేర్ చేయండి. అందులో ఏ సబ్జెక్ట్‌కు ఎంత టైమ్ చదవాలో క్షుణ్ణంగా రాసి పెట్టుకోవాలి.
-కష్టమైన సబ్జెక్ట్‌ల కోసం ఎక్కువ సమయం కేటాయించండి. డౌట్స్ కోసం మీ టీచర్స్, ఫ్రెండ్స్ సలహా తీసుకోవాలి.
-ముఖ్యంగా ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ అని పెట్టుకోకుండా.. ఒక రోజులోనే అన్ని సబ్జెక్ట్‌లు చదివేలా ప్లాన్ చేయండి. దీనివల్ల ఒకే సబ్జెక్ట్ చదివామని కాకుండా బోర్ కొట్టకుండా ఉంటుంది.
-టైమ్ తక్కువే ఉంది కదా అని మొత్తం చదవాలంటే తలపైకెత్తకుండా చదివితే ఒక నాలుగు రోజుల్లోనే బోర్ కొట్టి చదువంటేనే భయం ఏర్పడుతుంది. అలా కాకుండా మధ్యమధ్యలో బ్రేక్ ఉండాలి. ఈ సమయంలో అటూ ఇటూ లేచి నడవడం.. ఇష్టమైన పనిచేయడం వంటి వాటివల్ల రిలాక్స్ అవ్వొచ్చు.
-ప్రశ్నలు ఏం అడిగారు? అదే తెలుసుకోవాలన్న తాపత్రయం వద్దు. సబ్జెక్ట్ చదవండి. బట్టీ కాకుండా అర్థం చేసుకోవాలి.
-డైట్‌ను కూడా చక్కగా పాటించాలి. పోషకాహారం తీసుకుంటూ ఎక్కువగా నీరు తాగుతూ చాలినంత నిద్రపోవాలి.
-ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ఇంత చదవాలి.. అంత చదవాలి అంటూ కూర్చునే బదులు ఏ రోజుకారోజు ఎంత వీలైతే అంత చదువుతూ సబ్జెక్ట్‌పై నాలెడ్జ్ పెంచుకోవాలి.
-ఎంత గుర్తుంది? అనేది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల చదివిన దాన్ని మర్చిపోకుండా ఉంటారు.

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles