ఇదో వింత సమస్య!


Wed,March 6, 2019 02:38 AM

ఈ సమస్య వచ్చిన వారికి చెవుల్లో నిరంతరాయంగా గుయ్ మనే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అసలేంటీ సమస్య? ఇది రావడానికి గల కారాణాలేంటి? దీనికకి పరిష్కార మార్గాలేంటి?
tenitus
ఈ వ్యాధి పేరు టెనిటస్. ఈ సమస్య ఉన్న వారికి చెవుల్లో నిరంతరం గుయ్ మనే శబ్దం తప్ప మరేదీ వినపడదు. ఒక్కోరోజు రోజంతా ఉంటుంది. ఒక్కోసారి కాసేపటికి తగ్గిపోవచ్చు. కానీ, తగ్గే అవకాశాలైతే చాలా తక్కువ. అయితే యూకే పాడ్‌కాస్టర్లు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. దేని గురించైనా అతిగా ఆలోచించినా ఎక్కువగా ఒత్తిడికి గురైనా, అంతేకాదు సరిగా నిద్రలేకపోయినా టెనిటస్‌తో చెవులు మోతెక్కిపోతాయి. ఇది ఏ వయసు వాళ్లనైనా ఇబ్బంది పెట్టవచ్చు. టెనిటస్‌తో బాధపడుతున్న ఓ మహిళ దీని గురించి ఇంటర్‌నెట్‌లో వెతికినప్పుడు చాలామంది నీకు టెనిటస్ సమస్య ఉందా? అని ఆశ్చర్యంగా అడిగేవారు. నన్ను కూడా టెనిటస్ వ్యాధి పట్టి పీడిస్తుందని వారి అనుభవాలను తనతో పంచుకుంటారని చెబుతున్నది. అప్పుడే తనకి అర్థమైంది దీని గురించి చర్చించడం చాలా అవసరం. టెనిటస్‌కు సరైన పరిష్కారం లేదు. కాబట్టి, ఆశలు వదులుకోకుండా ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలి. తమ పనులు చేసుకుంటూనే వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే టెనిటస్ ప్రభావం నుంచి కొంతమేరకు బయటపడొచ్చు.

235
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles