ఇది షుగర్ వల్లేనా?


Tue,May 16, 2017 12:39 AM

నా వయసు 56 సంవత్సరాలు. 12 ఏళ్లుగా షుగర్ ఉంది. ఈ మధ్యలో ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్‌లో క్రియాటినిన్ 19మి.గ్రా / డె.లీ., యూరియా 28 మి.గ్రా./డె.లీ. ఉంది. యూరిన్ టెస్ట్‌లో ప్రొటీన్ 3+ అని చెప్పారు. షుగర్ వల్ల కిడ్నీ సమస్య రాకుండా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-రమణ, వరంగల్
Sugar
మీ రిపోర్ట్ ప్రకారం మీకు యూరిన్‌లో ప్రొటీన్ అధికంగా పోతున్నది. మొదట చేయాల్సిందేంటంటే, ఇది షుగర్ వల్ల వచ్చిన కిడ్నీ సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక ఇతర కారణాల వల్ల ఉందా అనేది తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్ దగ్గర రెటినా పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటినా దెబ్బతిన్నట్లయితే (డయాబెటిక్ రెటినోపతి) యూరిన్‌లో ప్రొటీన్ అధికంగా పోవడం కూడా షుగర్ వల్లే అయి ఉంటుంది ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా షుగర్ చాలా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా./డె.లీ. లోపు, తిన్న తరువాత 160 మి.గ్రా./డె.లీ.లో ఉండేటట్లు చూసుకోవాలి. బీపీ 125/75 లోపల ఉండాలి. యూరిన్‌లో ప్రొటీన్ పోవడాన్ని తగ్గించడం కోసం ఎసిఇ లేదా ఎడిబి అనే మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు 2 గ్రా. మించకూడదు. పొగతాగడానికి, ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడకూడదు.

డాక్టర్ విక్రాంత్ రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles