ఇది డేంగ్యూ జ్వరమా?


Wed,August 9, 2017 01:22 AM

నా వయసు 24 సంవత్సరాలు, ఈ మధ్య నేను మా ఊరు వెళ్లి వచ్చాను. తెల్లవారి నుంచి జ్వరం వస్తూ పోతున్నది. ఊర్లో చాలా మందికి డెంగ్యూ జ్వరం వస్తున్నట్టు అమ్మ చెప్పింది. డెంగ్యూ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి చికిత్స అవసరమవుతుందో చెప్పగలరు.
ప్రవీణ్, హైదరాబాద్

Mosquito
ముందుగా మీకు వచ్చిన జ్వరం ఎలాంటిదో నిర్ధారణ చెయ్యాల్సి ఉంటుంది. డెంగ్యూ జ్వరాన్ని నిర్ధారించడానికి డెంగ్యూ సీరాలజీ, డెంగ్యూ ఐజిజి, ఐజిఎం అనే పరీక్షలు అవసరమవుతాయి. అయితే ఫలితాలు రావడానికి 4-6 రోజుల సమయం పడుతుంది. కాబట్టి లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స ప్రారంభించడం మంచిది. బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ అవి తగ్గిపోకుండా చూసుకోవాలి. డెంగ్యూ జ్వరానికి ప్రత్యేక మందులు లేవు.

కాబట్టి లక్షణాలు తగ్గించేందుకు మాత్రమే మందులు ఇస్తారు. చికిత్స కంటే నివారణ మేలు వీలైనంత వరకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు వృద్ధి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ రాకుండా నివారించడం సాధ్యమే. ఒక్కోసారి మలేరియా కూడా డెంగ్యూ మాదిరిగానే అనిపిస్తుంది. కాబట్టి మీకు వస్తున్న జ్వరం ఎలాంటిదో ముందుగా నిర్ధారించుకోవడం అవసరం. చర్మం మీద మచ్చలు కనిపించడం, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి డెంగ్యూ లక్షణాలుగా చెప్పవచ్చు. జ్వరం తరచుగా వస్తున్నట్టు చెబుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి చికిత్స ప్రారంభించడం అవసరం.
DRGO

556
Tags

More News

VIRAL NEWS