ఇదిగో..మీ సత్తి


Sat,January 14, 2017 01:08 AM

బిత్తిరి సత్తి కేసీఆర్‌ను అనుకరించినా.. రేవంతం సారుకు నమస్తే చెప్పినా.. చంద్రాలు సారు గాలి మోటర్ల తిరుగుతుండన్నా.. సెల్ఫీష్ ఫొటోలన్నా.. బరాబర్ గిది మా అయ్య జాగిరే అని (తొడ మీద కాదు) పాదం మీద కొట్టుకున్నా.. సాఫిత్రీ అంటూ సాగదీసినా.. గల్లీ చిన్నదీ అంటూ రాగం పాడినా.. తెలంగాణ అంతా పడీ పడీ నవ్వింది. నవ్వుతున్నది. రాత్రి తొమ్మిదున్నరయిందంటే.. తెలంగాణ మొత్తం తీన్మార్ ముందు సేద తీరుతున్నదంటే అతియోశక్తి కాదేమో! ఇలా రోజూ మీరు టీవీలో చూసే సత్తిని తొలిసారిగా ఇలా జిందగీలోకి పట్టుకొచ్చినం.
bithirisathi

సంక్రాంతి పండుగకి పతంగులెక్కిస్తవా? ఇంకేం జేస్తవ్?


-సంక్రాంతి ఫండుగంటే ముందుగాల గుర్తుగొచ్చేవే.. ఫతంగులు. ఇప్పుడంటే రెడిమేడ్ ఫతంగులు కొని ఎక్కిస్తున్నరు. నేనైతే నా చిన్నప్ఫుడు దోస్తుగాళ్లతోని కలిసి న్యూస్ పేపర్‌తోని చీఫురు ఫుల్లలు అటోటి, ఇటోటి ఫెట్టి ఫతంగులు చేసుకునేటోన్ని. ఉడుకన్నంతోటి కాయిదం తోక ఫెట్టి మామిడి చెట్టు గడ్డకు ఫోయి ఎక్కిచ్చేటోన్ని. శనగదంటు, కందిదంటు వామ దంటు అన్ని తెచ్చి కట్టగట్టి ఇంటి మీదేస్తం. మొక్కుతం. ఆడోళ్లు ముగ్గులేస్తరు. మొగోళ్లు ఫెగ్గులేస్తరు.

ఎంత వరకు సదువుకున్నవ్?


-ఐదో తరగతి దాక మా ఊర్ల, ఆరో తరగతి నుంచి ఫదో తరగతి దాక చనువెల్లి హై స్కూల్‌ల సదివిన. ఇంట్లోళ్లు ఇబ్బందిఫెడితే ఇంటర్ ఫూర్తిజేశిన. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ శేద్దామనుకుని ఇటు దిక్కొచ్చిన.

మీ అమ్మానాయిన పేరేంది? ఏం జేస్తరు?


-యాదగిరిగుట్ట. దేవుళ్ల పేరు. అవును. మా అమ్మ పేరు యాదమ్మ, నాయిన పేరు నర్సింహ. మా నాయిన కావలికారి.

పాటలు బాగ పాడుతవ్? ఏడ నేర్సుకున్నవ్?


-చిక్కెంటికెలకు ఉఫిరి బుగ్గలు ఇచ్చే అయిన దగ్గర. అవును. ఫాత ఇనుప సామాను, ఖాళీ సీసాలు ఇస్తే ఫాటల పుస్తకాలు ఇచ్చేటాయన. ఫుస్తకాలల్ల చూసి ఫాడేటోన్ని.

ఇంతకు ముందు ఏడ పనిజేసినవ్?


-ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చెయ్యాలె గదా! ఎవుసం జేశిన. ఎవుసం చేసుకుంట సినిమలల్ల ట్రై జేశిన. 2003 నుంచే అవకాశాల కోసం తిరుగుతున్న. సినిమాల మీద ఇష్టంతోని కృష్ణానగర్ ఒచ్చి డైరెక్టర్లను కలిసేటోన్ని. ఒక రోజు ఒకాయన తమ్మారెడ్డి భరద్వాజ కంఫెనీల అసిస్టెంట్ మేనేజర్‌గా ఫని ఇచ్చిండు. కొన్ని రోజులు చేసిన. ఆడ ఈ ఫని ఏం చేస్తవు. నీ గొంతు మంచిగుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గ ట్రై చెయ్‌మన్నడు. అప్ఫటి వరకు నాకు డబ్బింగ్ అంటెనె తెల్వది. 2005లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా యూనియన్ మెంబర్‌షిఫ్ తీసుకున్న. ఫదమూడేళ్లకెళ్లి కొన్ని వందల సినిమాలల్ల క్రౌడ్ సీన్స్, ఫైట్ సీన్స్, క్యారెక్టర్లకు డబ్బింగ్ జెప్పిన. ఒక దిక్కు డబ్బింగ్ జెప్పుకుంటనే చిన్న వేశాల కోసం ప్రయత్నం జేశిన.
bithirisathi1

మరి సినిమా నుంచి టీవీకి వచ్చినవెందుకు?


-డబ్బింగ్ చెప్పినా సినిమాలల్ల కనిఫించాలనుండేది. అట్ల కొన్ని సినిమాలల్ల చిన్న ఫాత్రల్లో నటించిన. కానీ అవకాశాలు లేక, గుర్తింపు రాక ఊరికి ఎల్లిపోయిన. ఊర్లో ఉండి వ్యవసాయం జెయ్యాలని బోర్ ఏయించిన. నీళ్లు ఫడ్డయి. అప్పుజేశి పాలీహౌజ్ అరటి పంటలు ఫెట్టిన. కొత్తరకం డ్రిప్‌లతో తక్కువ ఫెట్టుబడితో మంచి ఫంట ఫండించిన. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సంపాదించినట్టు.. నేను మంచిగనే సంపాదించిన. కానీ నటించాలనే తపన మాత్రం తగ్గలె. అట్ల అప్పుడప్పుడు డబ్బింగ్ యూనియన్ మీటింగ్‌లకు హైదరాబాద్‌కు వచ్చిఫోతుండేటోన్ని. డబ్బింగ్ యూనియన్ మీటింగ్‌లల్ల బిత్తిరి సత్తిలాగ, ఊర్లలుండే ముసలోల్లలెక్క ఇమిటేట్ చేశేటోన్ని. యూనియనోళ్లు ఫడి ఫడి నవ్వేటోళ్లు. ఒకరోజు మీటింగ్ అయినంక 6టీవీ అని కొత్త ఛానెల్ వస్తుంది. ఫోయి కలిసి వద్దాం అంటే ఫ్రెండ్‌తో ఫోయిన. అక్కడ నర్సయ్య తాత అనే కాన్సెప్ట్ చెప్పిన. ఆళ్లకు నచ్చింది. అట్ల జీవితంలో మొదటిసారి ఉద్యోగంల శేరిన. ఎనిమిది నెలలు మన ఊరు ఫ్రోగ్రాం చేశిన.

వీ6ల అవకాశం ఎట్ల వచ్చింది?


-6టీవీల జాయిన్ కాకముందు వీ6ల కూడా టెస్ట్ షూట్ ఇచ్చిన. వీ6 ఛానల్ ఫెట్టినప్పుడే కొన్ని కాన్సెఫ్ట్‌లతోని ఇంటర్వ్యూకి ఫోయిన. టెస్ట్ కట్ చేసి ఫిలుస్తమని చెప్పిర్రు. అలా మూడేళ్లు గడిచిఫోయినయ్. 6టీవీల నా ఫెర్మామెన్స్ నచ్చి వీ6ల అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినంక తీన్మార్ ఫ్రోగ్రామ్‌ల నువ్వు కొత్తగా ఏం జేస్తవు అని అడిగితే రెండు మూడు రకాల వేషాల గురించి శెప్ఫిన. అందులో బిత్తిరి సత్తి క్యారెక్టర్ నచ్చి చెయ్యిమన్నరు. ఫ్రోగ్రామింగ్ హెడ్ దామోదర్ రెడ్డి ఫ్రోమోలు చేయడం ఫ్రోగ్రాం హిట్టయి జనాల్లోకి యెళ్లడం అన్ని మీరు చూస్తనే ఉన్నరు.

పూల అంగీ, లోడాస్ లాగు ఏసుకోమని ఎవరు జెప్పిరు?


-ఊర్ల మామూలు జనాలు బట్టలు ఎట్ల తొడుక్కుంటరో అట్లనే వేస్తే బాగుంటది. లాగు, అంగీ ఏస్తే మంచిగుంటదని చెప్పిన. మా సీఈఓ అంకం రవిగారు దానికి మెరుగులు దిద్ది గిట్ల ప్రత్యేకమైన ఫూల అంగీ, లోడాస్ లాగును డిజైన్ జేశిర్రు.

కొత్తలో జరంత ఇబ్బంది పడ్డట్టు క(అ)నిపించింది?


-ఫ్రోగ్రాం స్టార్ట్ అయిన కొత్తలో కొంత మంది మానసిక వికలాంగునితోని ఫ్రోగ్రాం చేయిస్తున్నరు. మనోభావాలు దెబ్బ తీస్తున్నరు. మానవ హక్కుల సంఘంల ఫిర్యాదు చేస్తమని బెదిరించిర్రు. ఎన్ని రకాల బెదిరింపులొచ్చినా వీ6 సీఈఓ అంకం రవి సార్ ధైర్యం చెప్పి చేయించిండ్రు. ఏం కాదు. క్యారెక్టర్ నిన్ను నిలబెడుతుంది. ఇలాంటివి మామూలే అని వెన్నుతట్టిర్రు. అఫు్పుడు నచ్చనోళ్లకు కూడా ఇప్పుడు తీన్మార్ ఫ్రోగ్రాం నచ్చుతంది. అలాంటోళ్లు బిత్తిరి సత్తికి(నాకు) ఫ్యాన్స్ అయిర్రు.

సినిమలల్ల కూడా చేస్తున్నవా?


-వెండి తెర మీద నటించాలనే వచ్చిన. టైం సుట్టు తిప్పి చిట్యాలకు తీసుకొచ్చినట్టు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా చేసినంక సినిమాలల్లకు తీసుకుఫోయింది. ఇప్పుడిప్పుడే అవకాశాలొస్తున్నయి. ఫెద్ద ఫెద్ద డైరెక్టర్లు ఆఫర్లు ఇస్తున్నరు. సంపత్ నంది దర్శకత్వంల గోపిచంద్ హీరోగ జేస్తున్న సినిమాల నటించిన. జయంత్ సీ పరంజీ దర్శకత్వంలో వస్తున్న సినిమాల కూడా మంచి పాత్ర చేసిన. ఇంకా చాలా సినిమాలల్ల అడుగుతున్నరు.

ఇంత హిట్ అయినవ్. ఇంకేం జేస్తవ్?


-హీట్ అయినంక ఏమయితం. సూపర్ సూపర్ హీట్ కావాలె. ఎంత హీట్ అయినా సినిమాలు మాత్రం చేస్త. ఇంత హీట్ కావడానికి కారణం ప్రేక్షకులు. వారి కోసం ఇంకా ఏమైనా చేస్త. వాళ్లను నవ్వించడం కోసం రోజు వార్తలు చెఫు్పుకుంటనే సినిమాలు చేస్తా. శుక్రవారం ఫూట కొత్త సినిమాలల్ల కొత్త కొత్త క్యారెక్టర్లల్ల నవ్విస్తనే ఉంట.

మీ అక్క ఎప్పుడైన కొట్టిందా?


-రోజు కొడ్తది. నెత్తి మీదనో, ఈపు మీదనో కాదు. కడుపు మీద. ఎట్లనుకుంటున్నరా? నాకు నీసు అంటే ఇష్టం. వారానికొక దినమే ఒండుతది. నిజంగ అనుకుంటున్నరా? కాదు. మజాక్‌ల చెప్పిన. మా అక్క కొట్టుడు కాదు కదా! పల్లెత్తు మాట అనది.

ఇంత గుర్తింపు వస్తుందనుకున్నవా?


-వయసుతో సంబంధం లేకుండా మూడు తరాలోళ్లు తీన్మార్ చూస్తున్నరు. వెండితెరపైకి వెళ్లాలనుకున్న. ప్రజల(మీ) గుండె తెరల్లో నిలిచిపోయిన. ఇది చాలు ఈ జీవితానికి. బతకడం కోసం ఇట్ల చేస్తే మీ ఆదరణతో నన్ను బాగుపరిచిర్రు. నేను మాట్లాడుతుంటే ఈలలు, నవ్వులు, సప్పట్లు వింటుంటే మస్తు ఖుష్ అయితుంది. సినిమాల్లో చేస్తే ఎైట్లెనా వస్తది అనుకున్న. కానీ ఇంతగా కాదు. ఏదో కొత్త ఫ్రయత్నం చేద్దామనుకుంటే ఆదరించి అక్కున చేర్చుకున్నరు. మెచ్చుకుని మెడలేసుకున్నరు. మీలో ఒకన్ని చేసుకున్నరు. ఇంటి మనిషిలాగ చేసుకున్నరు.

రుద్రమ దేవిలో కూడా నటించినట్టున్నవ్?


-అల్లు అర్జున్‌కి గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కోసం తెలంగాణ యాస నేర్పించడానికి వెతికిర్రు. అఫు్పుడు తెలిసిన ఒక ఫ్రెండ్ నన్ను బన్నీ బయ్యకు కలిపించిండు. నెల రోజులు బన్నీ బయ్యకు తెలంగాణ యాస నేర్పించిన. ఎంతో తపనతో నెల రోజుల్లో యాస నేర్చుకున్నడు. యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్తే సామంత రాజు అనే చిన్న క్యారెక్టర్ ఇప్పించిండు. దూరం నుంచి హీరోలంటే ఏమో అనుకుంటం కానీ.. హీరో అంటే అల్లు అర్జున్ అంత కసిగా ఉండాలె. కష్టపడితేనే నిలబడతమనే విషయాన్ని నమ్మి బాగా కష్టపడే వ్యక్తి అల్లు అర్జున్. ఆయనలో ఆ విషయం బాగా నచ్చింది.

నిజంగా మీ పేరు బిత్తిరి సత్తినా?


అస్సల్ పేరు కావలి రవికుమార్. సినిమా ఇండస్ట్రీల అందరు చేవెళ్ల రవి అంటరు.

ఏ ఊరు మీది?


రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన.

హీరోగ పెట్టి సినిమా తీస్తే.. జేస్తవా?


అట్ల అడుగొద్దు. అను(భి)మానులు ఫేల్ అయితరు. చేస్తందుకే ఉన్న. చేస్తందుకే వచ్చిన. మంచి అవకాశం వస్తే ఏమైనా చేస్త.

సినిమాల్ల బిజీ అయితే వార్తలు వదిలేస్తవా?


వార్తలు చెఫ్తూ సినిమాలు చేసుకునే అవకాశం సీఈఓ సారు ఇచ్చిండ్రు. వీ6లాంటి సంస్థను ప్రారంభించిన వివేక్ సార్‌కు, అంకం రవి సార్‌కు ఫ్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నాలాంటి ఎంతో మంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చిర్రు.

ఏ హీరో ఇష్టం?


యాక్టింగ్‌ల సూపర్‌స్టార్ రజినీకాంత్, టైమింగ్‌ల కమల్‌హాసన్, డాన్సింగ్‌ల చిరంజీవి.
-అజహర్ షేక్ ,కంది సన్నీ

6861
Tags

More News

VIRAL NEWS

Featured Articles