ఇక వాట్సప్ ద్వారా పాలసీలు


Sat,January 5, 2019 01:09 AM

whatapp-UPI
మీరు పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..అయితే ఆయా సంస్థల కార్యాలయాలు, ఏజెంట్ల చుట్టు తిరగాల్సిన పని లేదు. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మీకు నచ్చిన పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకుంటే బీమా రంగ సంస్థల మధ్య నెలకొన్న పోటీ వినూత్న సేవలకు శ్రీకారం చుడుతున్నాయి ఆయా సంస్థలు. దీంట్లోభాగంగా ఇక నుంచి వాట్సప్ ద్వారా పాలసీని అందచేయడంతోపాటు ప్రీమియం చెల్లింపులు జరిపే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నాయి పలు ప్రైవేట్ సంస్థలు. వీటిలో భారతీ యాక్సా లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు పాలసీలను వాట్సప్‌లో డెలివరీంగ్ చేయడంతోపాటు రెన్యూవల్ ప్రీమియంను చెల్లింపులు జరిపే అవకాశాన్ని కూడా కల్పించాయి. ఇలా నూతన సేవలను ప్రారంభించడం బీమా రంగంలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారత్‌లో 20 కోట్ల మంది వినియోగదారులు సామాజిక మాధ్యమాలైన వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ రెంగు బీమా రంగ సంస్థలు ఇలా నూతన సేవలకు శ్రీకారం చుట్టాయి.

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles