ఇండియాలో అవి తక్కువే!


Sun,February 3, 2019 12:44 AM

సామాజిక వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ అనేది ముఖ్యం. అందులో వివాహం అత్యంత కీలకమైంది. అయితే ఈ వివాహం తర్వాత వివాదాలు ఏర్పడితే చట్టపరమైన అంగీకారంతో తీసుకునేవి విడాకులు. ప్రపంచ వ్యాప్తంగా చేసిన ఓ సర్వేలో తేలింది ఏంటంటే.. విడాకులు తీసుకునే దేశాలన్నిటితో పోల్చితే మన దేశంలోనే విడాకుల ఘటనలు తక్కువ ఉన్నాయని తేలింది..
Marriagepics
సామాజిక, చట్టబద్ధమైన ఆమోదంతో ఇద్దరు కలిసి జీవించడానికి ఇష్టపడడమే పెండ్లి. ఇరువురి మధ్య సంబంధ బాంధవ్యాలను, ఉమ్మడి నివాసాన్ని సమాజం ఆమోదిస్తుంది. ఇలా ఏర్పడ్డ జీవితంలో గొడవలు ఏర్పడితే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం విడాకుల అవసరం తక్కువ మందికి వస్తుంది. సుమారు వెయ్యి పెండ్లిళ్లల్లో 13 మంది మాత్రమే విడాకులు కోరుతున్నారని తాజా సర్వే తెలిపింది. అంటే ఇతర దేశాలతో పోల్చితే ఒక్కశాతం దంపతులే విడాకులు తీసుకుంటున్నారట. దీనికి కారణం ఇతర దేశాల సంస్కృతికి, మన దేశ సంస్కృతికి మధ్య తేడా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. వివాహ ప్రాముఖ్యాన్ని ఇక్కడున్న దంపతులు గుర్తిస్తున్నారట. ఒకవేళ విడిపోవాలనుకున్నా కుటుంబం, పిల్లలు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సర్వే నిర్వాహకులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ల వల్ల కూడా మళ్లీ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారని సర్వే వెల్లడించింది. సమస్యలు వచ్చినా బంధాలకు విలువనిచ్చి కలిసుంటారని ఆ సర్వే పేర్కొంది. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, రాజస్థాన్‌లో విడాకుల శాతం తక్కువగా ఉందట. ముఖ్యంగా ఆయా దేశాల్లో విడాకులకు కారణం అర్థం చేసుకోకపోవటం, అవిశ్వాసం, డ్రగ్స్, అల్కహాల్‌కు బానిస అవడం, మానసికంగా,శారీరకంగా వేధించడం విడాకులకు కారణం అని పేర్కొంది.

514
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles