ఇంటిని చల్లగా మార్చేయండిలా!


Fri,March 1, 2019 01:39 AM

వేసవి వచ్చిందంటే బయటా, ఇంట్లో తేడా లేకుండా వేడి అధికంగా ఉంటుంది. ఇంటిని చల్లబరిచే కర్టెన్లు మార్కెట్లో ఉన్నాయి. వేసవిలో ఎలాంటి కర్టెన్లు వాడాలో తెలుసుకోండి.
curten
-పూల కర్టెన్లు : ఇల్లు సహజమైన ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉండాలంటే పూల డిజైన్లు ఉన్న కర్టెన్లు సరైన ఎంపిక. అందంగా, చాలా తేలికగా ఉంటాయి.
-తెల్లని లేసులున్న కర్టెన్లు : ఇవి వేసవికి అత్యద్భుతంగా నప్పుతాయి. తేలికైన రంగు కలిగి ఉండడం వల్ల ఇంటిని చల్లగా మారుస్తాయి.
-కుచ్చులున్న కర్టెన్లు : ఇవి లివింగ్ రూంకి స్త్రీతత్వ శోభను చేకూరుస్తాయి. కనుక ఒంటరి మహిళలు ఉండే ఇంటికి ఇవి సరైనవి.
-ప్రింటు కర్టెన్లు : వేసవికి ముదురు రంగు ప్రింటింగ్ ఉన్న కర్టెన్లును ఉపయోగించవచ్చు. ముదురు రంగులను ఇష్టపడేటట్లయితే ఇవి సరైనవి.
-ఎర్రని కర్టెన్లు : చాలామంది ఇటువంటి కర్టెన్లను ఇష్టపడరు. కానీ వేసవిలో ఇంటికి కొత్త అందంతో పాటు చల్లదనాన్ని చేకూర్చాలంటే ఇవి లివింగ్ రూం కిటికీలకు అత్యుత్తమమైనవి.
-ఇంద్రధనస్సు కర్టెన్లు : వేసవిని ఈ కర్టెన్లతో ఉత్సాహవంతం చేసుకోండి. విభిన్నమైన రంగులను ఇష్టపడేట్లయితే ఇవి సరైన ఎంపిక.
-తెల్లని కర్టెన్లు : లివింగ్ రూం కిటికీలకు తెల్లని కర్టెన్లు కనుక వాడినట్లయితే కాంతివంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది.
-పసుపు రంగు చెక్స్ కర్టెన్లు : ఈ రకం కర్టెన్లు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇంటిని కూడా ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఈ కర్టెన్లతో మీ ఇంటికి ప్రత్యేక శోభను చేర్చండి.

362
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles