ఇంటింటా అందాలు.. గాయత్రి సూత్రాలు..


Tue,February 19, 2019 01:49 AM

ఒక్కసారి ఇల్లంతా పరికించి చూడండి.. చిందరవందర గందరగోళంగా కనిపిస్తుంది కదా.. మీ ఇల్లే కాదు.. ప్రపంచంలో చాలా ఇండ్లు ఇలాగే కనిపిస్తాయి.. ఎంత సర్దినా ఏదో ఒక మూలన ఏదో ఒక వస్తువు మనల్ని వెక్కిరిస్తూనే ఉంటుంది.. కానీ కాన్‌మరీ మెథడ్‌తో ఇంటిని సర్దితే అందంగా మెరిసిపోతుందట.. ఇంతకీ ఈ పద్ధతి ఏంటి? ఎలా తెలుసుకోవాలనే కదా మీ సందేహం.. కాన్‌మరీ కన్సల్టెంట్‌గా మారి.. ఇంటిని అద్దంలా మార్చడమే కాదు.. అందంగా మార్చేందుకు సెషన్స్ కూడా ఇస్తున్నది గాయత్రి గాంధీ.. భారతదేశంలో ఇలా ఇంటిని సర్దే కన్సల్టెంట్‌గా మారిన ఏకైక.. మొదటి మహిళ ఈమె.. మరి ఆమె చెప్పే కొన్ని చిట్కాలతో పాటు, ఆమె గురించి కూడా తెలుసుకుందామా..
gayatrii-policies
ప్రమీల (పేరు మార్చాం..) ఒక ఉద్యోగిని. ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేసి.. బస్సుల్లో పడి వచ్చేసరికి మొత్తం పనిగంటలు కాస్త 12గంటలు అవుతున్నాయి. వీకెండ్స్ అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతాయి. పిల్లలు.. వారి చదువులతో తన షెడ్యూల్ అంతా బిజీ. ఇక ఇల్లు సర్దే తీరిక ఉండదు. ఒక్కసారి ఇంటిని చూస్తే పెంట కుప్ప అయినా నయం అనుకుంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. కొత్త సామాన్లు వచ్చి పడుతున్న కొద్దీ ఇల్లు ఇంకాస్త పెద్దగా ఉంటే బాగుంటుందనే ఆలోచిస్తుంది తప్ప.. ఇంట్లో పనికి రాని వస్తువులు పడేస్తే ఆ జాగలో వీటిని పెట్టొచ్చనే ఆలోచన రాదు.


సుధ (పేరు మార్చాం..) గృహిణి. ఇద్దరు పిల్లలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. భర్త రిటైర్ అయి ఇంట్లో ఉంటున్నాడు. ఇంటిని చూసి ఎప్పుడూ విసుక్కుంటుంటాడు. ఖాళీగా కూర్చోకపోతే ఇంటిని సర్దొచ్చు కదా అన్నది ఆయన అభిప్రాయం. ముఖ్యంగా పిల్లల గదులు సరిగ్గా లేవని ఆయన కంప్లయింట్. పిల్లలేమో.. ఎక్కడివక్కడ పడేసి వెళుతుంటారు. ఎంత సర్దినా కూడా ఏదో ఒకటి మంచం మీద.. కింద పడుతూనే ఉంటాయి. ఆమెకు విసుగొచ్చి సర్దడం మానేసింది. ఎప్పుడైనా టూర్‌లకు వెళ్లినా మనిషికో సూట్‌కేసు అవుతుంది. ఎంతకాదను కున్నా సూట్‌కేసుల బరువు తగ్గడం లేదు.

gayatrii-policies4


ఈ ఇద్దరి కథలు చదివాక.. ఇది మీ స్టోరీనే అనిపిస్తున్నది కదా! మీరనే కాదు.. ప్రపంచంలో ప్రతీ మహిళ ఇలాగే అనుకుంటుంది. ఇళ్లనే కాదు.. ఆఫీసు టేబుల్‌ని చూస్తే కూడా ఇలా చిందరవందరగానే ఉంటుంది. కానీ ఒకసారి సర్దిన తర్వాత ఇక అదే పద్ధతిని ఫాలో అయితే ఈ చికాకు ఉండదంటుంది గాయత్రి. ముందు ఉన్న వస్తువులను సర్దడం కాదు.. అవసరం లేని వస్తువులను తీసేస్తే కావాల్సినంత స్థలం వస్తుందనేది కాన్‌మరీ మెథడ్‌లో మొదటి స్టెప్ అంటున్నదీమె. నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌లో టిడింగ్ అప్ విత్ మారీ కోండో సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. అందులోని ఫిలాసఫీ చూశాకే గాయత్రిలో అంతర్మథనం మొదలైంది.


మొదటి కన్సల్టెంట్..

భారతదేశ డిస్కవరీ నెట్‌వర్క్స్‌లో దశాబ్ద కాలంగా పనిచేస్తుంది గాయత్రి. ఆమెకు ఏ పనినైనా క్రమపద్ధతిలో చేయడం అలవాటు. పైగా మీడియాలో పని కావడం వల్ల ఆఫీసు పనిలోనే కాదు.. ఇంట్లో పనులనూ క్రమశిక్షణగా చేసేది. ఒకసారి మారీ కొండో రాసిన చేంజింగ్ మ్యాజిక్ ఆఫ్ టిడింగ్ ఆప్ అనే పుస్తకం ఆమె కంట పడింది. ఇంట్లో శుభ్రత లేకపోతే.. ఆ ఇంట్లో నెగెటివిటీ తాండవిస్తుందని నమ్ముతుంది. అందుకే ఆ పుస్తకం చదివి తన ఇంటిని మరింత అద్దంలా మార్చాలని భావించింది. మారీకొండో పద్ధతి ప్రకారం ముందు పనికిరాని వస్తువులను ఏరిపారేసింది. తన భర్త కూడా అందుకు సహకరించడంతో ఆమె ఇంటిని మార్చే పనిలో సక్సెస్ అయ్యింది.


జాయ్ ఫ్యాక్టరీ..

మన జీవితమే మనకు కావాల్సినన్ని పాఠాలు నేర్పిస్తుంది. గాయత్రి విషయంలో కూడా అదే జరిగింది. హర్యానాకి చెందిన ఈమె ఉద్యోగాన్ని వదిలేసి మరికొందరి జీవితాల్లో పాజిటివిటీని పెంపొందించాలని అనుకుంది. మారీ కొండో దగ్గరికెళ్లి శిక్షణ తీసుకొని కాన్‌మరీ సర్టిఫికెట్‌ని పొందింది. అలా 2017 ఆగస్టులో జాయ్ ఫ్యాక్టరీ పేరుతో ఒక కన్సల్టెన్సీ, వెబ్‌సైట్‌ని కూడా ఓపెన్ చేసింది. ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇప్పటికి 20 ఇండ్లను అద్దంలా తీర్చిదిద్దింది. ఒక్కో ఇంటిని మార్చేందుకు 10 నుంచి 50 గంటల సమయం పడుతుందట. ఆ ఇంటి పరిస్థితిని బట్టి సమయం మారుతుందట. భారతదేశంలో ఎక్కడైనా సరే పిలిస్తే వస్తానంటుంది. గంటకు 2500 రూపాయల నుంచి 3వేల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది.


ఈమె ఎందుకు?

మీరు కొత్తగా ప్రారంభించే ఈ క్షణం కోసం మీ జీవితాన్ని రీసెట్ చేసుకోండి మ్యారీ కొండో చెప్పిన మాటలు. వీటిని ఆచరించేందుకు ఇష్టపడుతుంది గాయత్రి. ఈమె జాయ్ ఫ్యాక్టరీ ద్వారా సీ2ఎస్2 (ఇంగ్లిష్ అక్షరాలు) పద్ధతిని అవలంబిస్తున్నది. అంటే.. కలెక్ట్, చూజ్, స్క్రాప్, స్టోర్ అనే పద్ధతులను కరెక్ట్‌గా పాటిస్తే ఇల్లు అద్దంలా మెరిపించేయొచ్చంటున్నది గాయత్రి. ముందుగా ఫోన్ చేస్తే మీ ఇంటిని చూస్తుంది. మీతో మాట్లాడి మీకు కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా కస్టమైజ్డ్ ప్లాన్ గీస్తుంది. దానికి తగ్గట్టుగా ఇంట్లో ఉన్న గిన్నెలు, బట్టలు ఇలా ఒక క్రమపద్ధతిలో అమర్చి పెడుతుంది. ఇందులో కూడా యూనిక్ కాన్సెప్ట్‌లతో ఇంటిని అందంగా మార్చడంలో గాయత్రిది అందవేసిన చేయి. ప్రతీ విషయానికి 360 డిగ్రీల సొల్యూషన్ ఉంటుందని నమ్ముతుంది. అందుకే తన దగ్గరకు క్లయింట్స్ కూడా ఎక్కువే వస్తున్నారంటున్నది గాయత్రి.


gayatri-policies2

అనుభవాలే పాఠాలు..

నేను ఎంతోమంది క్లయింట్స్‌ని కలిశాను. అందులో కొందరు ఓసీడీ సమస్యతో బాధపడుతున్న వాళ్లుంటారు. కానీ వారికి ఆ సమస్య ఉందన్న విషయం అర్థం కాదు. అలాంటి ఓ కేస్ వచ్చింది. ఆమెతో 50 గంటలు పనిచేశాక ఆమెకే ఓసీడీతో బాధపడుతున్నట్లు అర్థమయింది. తను థెరపీకి వెళ్లడమే కాదు.. ఆ తర్వాత నా పనిని మెచ్చుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇలాంటి ఎన్నో అనుభవాలు మరికొన్ని కొత్త పాఠాలను నేర్పిస్తుంటాయని నమ్ముతాను. ప్రతీ ఇంటికి వెళ్లి నేను సర్దలేను కాబట్టి.. కొన్ని సెషన్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాను. వారి ఇంటిని వారే బాగు చేసుకునేలా కాన్‌మరీ పద్ధతిని అర్థమయ్యేలా చెబుతాను. దేశంలో అస్తవ్యస్తంగా లేని ఇంటిని చూడాలన్నదే నా కల అంటున్నది గాయత్రి.


gayatri-policies3

కొన్ని చిట్కాలు..

-ఆఫీసులో పనిచేసి ఇంటికి వచ్చి అలసిపోతారు. కానీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంటిని సర్ది ఆ తర్వాత రిలాక్స్ అయితే చెత్త పేరుకోకుండా ఉంటుంది.
-మనం ఏ పనైనా అడ్డంగా చేయడం అలవాటు. అల్మరాలు అడ్డంగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా అడ్డంగా సర్దేస్తుంటాం. అలా చేయకూడదు.
-బట్టలు, పుస్తకాలు, కిచెన్ వేర్ ఏదైనా.. పైన షెల్ఫ్‌లో ఒక భాగం అయ్యాక కింద షెల్ఫ్.. ఇలా అన్ని షెల్ఫ్‌లు అయ్యాక మొదటి షెల్ఫ్‌లో రెండో లైన్ మొదలు పెట్టాలి. ఇలా చేస్తే అల్మరాలు చూడడానికి అందంగా కనిపిస్తాయి.
-ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో కొనేసి ఇంటిని మొత్తం నింపేస్తున్నారు. అలా కూడా వద్దు. కచ్చితంగా స్టోర్‌కి వెళ్లి అది ఆక్రమించే స్థలం ఎంత.. అది ఎంత వరకు అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అంతా సవ్యమే..


ఇల్లు ఎంత విశాలంగా కనిపిస్తే అంత ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచనలు, మీ దృక్పథం మారాలనుకుంటే కచ్చితంగా అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సవ్యంగా మార్చేందుకు ప్రయత్నించాలంటుంది మారీ కొండో. ఈమె ఈ కన్సల్టెంట్ బిజినెస్‌ని తన 19వ యేట ప్రారంభించింది. టోక్యో నగరానికి చెందిన మారీ చేంజింగ్ మ్యాజిక్ ఆఫ్ టిడింగ్ అప్ పుస్తకం రాసింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో ఈమె పుస్తకం నంబర్ వన్‌గా నిలిచింది. 2015 ప్రకారం టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంతమైన వారిని ప్రకటించింది. అందులో మారీ పేరు కూడా ఉంది. మీ మనసు మాట వినండి.. మీకు విపరీతంగా నచ్చిన వస్తువైనా సరే వాటి పని అయిపోయిందంటే బయట పడేయాల్సిందే. కాకపోతే ఆ వస్తువు అందించిన సేవకు ఒక ధన్యవాదాన్ని చెప్పి.. వాటిని దూరం చేసుకోండి. అప్పుడే మీతోపాటు మీ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అంటుంది మారీ.


అంతా సవ్యమే..

ఇల్లు ఎంత విశాలంగా కనిపిస్తే అంత ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచనలు, మీ దృక్పథం మారాలనుకుంటే కచ్చితంగా అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సవ్యంగా మార్చేందుకు ప్రయత్నించాలంటుంది మారీ కొండో. ఈమె ఈ కన్సల్టెంట్ బిజినెస్‌ని తన 19వ యేట ప్రారంభించింది. టోక్యో నగరానికి చెందిన మారీ చేంజింగ్ మ్యాజిక్ ఆఫ్ టిడింగ్ అప్ పుస్తకం రాసింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో ఈమె పుస్తకం నంబర్ వన్‌గా నిలిచింది. 2015 ప్రకారం టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంతమైన వారిని ప్రకటించింది. అందులో మారీ పేరు కూడా ఉంది. మీ మనసు మాట వినండి.. మీకు విపరీతంగా నచ్చిన వస్తువైనా సరే వాటి పని అయిపోయిందంటే బయట పడేయాల్సిందే. కాకపోతే ఆ వస్తువు అందించిన సేవకు ఒక ధన్యవాదాన్ని చెప్పి.. వాటిని దూరం చేసుకోండి. అప్పుడే మీతోపాటు మీ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అంటుంది మారీ.


-సౌమ్య నాగపురి

767
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles