ఆ దేశాల్లోనే లింగ సమానత్వం!


Sun,March 10, 2019 12:28 AM

మహిళలు, పురుషులను సమానంగా చూస్తామని అన్ని దేశాలు చెబుతుంటాయి. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలుసుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కేవలం ఆరు దేశాల్లో మాత్రమే లింగసమానత్వం చూపుతున్నారని తేలింది. మన దేశ స్థానమెంతో తెలుసా?
countries
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని దేశాలు ఘనంగా జరుపుకొన్నాయి. అయితే కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మహిళకు స్వేచ్ఛనిస్తున్నారని చాలామంది అనుమానం. ఈ నేపథ్యంలో లింగ సమానత్వం ఏయే దేశాల్లో అమలవుతున్నదో తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ఓ సర్వే చేపట్టింది. ఉమెన్, బిజినెస్ అండ్ ద లా 2019 పేరుతో పదేండ్లలో మహిళలు ఆర్థిక సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో తెలుసుకుంది. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం కేవలం ఆరు దేశాల్లో మాత్రమే పురుషులు, మహిళలు సమాన హక్కులు కలిగి ఉన్నారని తెలిసింది. వాటిల్లో స్వీడన్, లక్సెంబర్గ్, లట్వియా డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలు లింగసమానత్వంలో 100 శాతం స్కోర్ సాధించాయి. మిగిలిన ఏ దేశానికీ వంద స్కోర్ రాలేదు. అధ్యయనం చేసిన 131 ఆర్థిక వ్యవస్థల్లో 74.71 సగటున గ్లోబల్ స్కోరు ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అంటే సగటు ఆర్థిక వ్యవస్థ పురుషులకే మూడో వంతు హక్కులను ఇస్తుంది. దీనిలో భారతదేశం చాలా ముందుండి.. యావరేజ్ గ్లోబల్ స్కోర్‌కి చివర్లో ఉంది. మొత్తానికి భారతదేశం లింగసమానత్వంలో మైనస్ 71.25 స్కోర్ సాధించింది. అమెరికా 83.75 స్కోర్ సాధించింది. గోయింగ్ ప్లేస్, స్టార్టింగ్ ఎ జాబ్, గెట్టింగ్ పెయిడ్, గెట్టింగ్ మారీడ్, హావింగ్ చిల్డ్రన్, రన్నింగ్ ఎ బిజినెస్, మేనేజింగ్ అసెర్ట్స్, గెట్టింగ్ ఎ పెన్షన్ వంటి అంశాలను ఆధారం చేసుకొని ఈ సర్వే నివేదికను వెల్లడించారు. మహిళలు టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈఓ స్థానాలకు చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారని నార్త్ కరోలీన యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ జిల్ యావరోస్కీ చెబుతున్నారు.

279
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles