ఆ గ్రామ ప్రజల ఆకాంక్ష


Thu,March 14, 2019 12:20 AM

ఆమె పట్టణంలోనే పుట్టి పెరిగింది. కానీ పర్యావరణం పై శ్రద్ధ ఆమెను పల్లెటూర్ల వైపు నడిపించింది. సోషల్ సైన్స్ విద్యను అభ్యసించి ఆమె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి సారించింది. పుణేకు చెందిన ఆంకాంక్ష ఇప్పుడు రైతులకు, గ్రామస్తులకు ఆశాకిరణంగా మారింది.
Akansha
ఆకాంక్ష పెద్ద చదువులు చదివి దాన్ని పేద వారి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నది. సోసల్ స్టడీస్‌లో ప్రాజెక్ట్ పని మీద గ్రామాలను సందర్శించేది. గ్రామాల్లో ఉన్న దయనీయ పరిస్థితులను చూసి చలించిపోయింది. తన 24 వ ఏటా మహారాష్ట్రలోని సమస్తిపూర్ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆ గ్రామస్తుల జీవన విధానాన్ని కంళ్లారా చూసింది. మరుగుదొడ్లు లేకుండా, కనీసం కరెంటు లేకుండా గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. రైతులు భూములు కౌలుకు తీసుకొని, అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ గ్రామంలో పశువుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. అయినా రసాయన ఎరువులు వాడడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆవు పేడను కాల్చేయడం చూసింది. దాని వల్ల వచ్చే పొగ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వచ్చి చంద్రుని వెలుతురులోనే భోజనాలు చేయడం, చీకటి పడగానే నిద్రపోవడం ఆమెను ఆలోచనలో పడేసింది. కేవలం అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు ఈ పరిస్థితిని ఎదుర్కుంటున్నారని తెలుసుకుంది. పరిస్థితిని మార్చి సేంద్రియ వ్యవసాయం, బయోగ్యాస్, బయో ఎలక్ట్రిసిటీని ఈ గ్రామస్తులకు అందించడం కష్టమేం కాదు. వారి బతుకుల్లో వెలుగు నింపాలనుకుంది. వెంటనే తోటి మిత్రులతో స్వయంభు అనే ఆర్గనైజేషన్ స్థాపించి గ్రామస్తులకు సహజవనరులను అందించేందుకు కృషి చేసింది. ఇదే విషయం గ్రామస్తులతో మాట్లాడింది. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదు. బయో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కొంచెం స్థలం కావాలి, దాని నుంచి వాచ్చే గ్యాస్ వంటింట్లో ఉపయోగపడుతుంది, ఆ ప్లాంట్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు అని గ్రామస్తులకు అవగాహన కల్పించింది. చాలా రోజుల తర్వాత ఓ రైతు తన భూమిలోని కొంత స్థలాన్ని ఈ విద్యార్థులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో వెంటనే ఆంకాంక్ష తన ప్రాజెక్ట్‌లో నిమగ్నం అయింది. సేంద్రియ ఎరువులు వాడడం, జీవపదార్థాల తయారీ, గోబర్ గ్యాస్, బయో ఎలక్ట్రిసిటీ వాడకం మీద అవగాహనా సమావేశాలు నిర్వహించి స్థానికులను చైతన్యం చేసింది. ఇప్పుడు గ్రామంలో రెండు బయోప్లాంట్‌లను ఏర్పాటు చేసి వీటి ద్వారా గ్యాస్, కరెంట్ అందించేందుకు తోడ్పడుతున్నది.

344
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles