ఆహా.. అరటి-బనాలో ఫెస్టివల్ బాబూ..


Thu,November 13, 2014 01:14 AM

banana

ఆదివారం నాడు అందంగా మొలిచి.. సోమవారం నాడు సుడిచేసి పెరిగింది. మంగళవారం నాడు మారాకు వేసి.. బుధవారం నాడు బుడ్డిగెల వేసింది. గురువారం నాడు గుబురులో దాగి.. శుక్రవారం నాడు చూడగా పండింది. శనివారం నాడు చకచకా గెలకోసి.. అందరికి అయ్యింది ఆరోగ్య భోజనం..!! ఏంటో చెప్పుకోండి.?! అదేనండీ మీ బాబు ఎల్‌కేజీలో బట్టీపట్టిన బనానా రైమ్. ఇదేగా! బనానా అందరికీ ఫేవరెటే. పిల్లలైతే అన్నం కంటే అరటినే ఎక్కువ ఇష్టపడతారు. రేపు చిల్డ్రన్స్ డే సందర్భంగా బనానా ఐటెమ్స్‌ను వారి లంచ్‌బాక్స్‌లో పెట్టండి.. ఇప్పట్నుంచే ప్రిపేరవ్వండి మరి!

Banana-Pudding

బనానా పుడ్డింగ్

కావలసిన పదార్థాలు :


వెనీలా : ఒక బాక్స్
పాలు : 2 కప్పులు
హెవీ క్రీమ్ : ఒక కప్పు
చక్కెర : 3 టేబుల్‌స్పూన్స్
వెనీలా వాఫర్స్ : 2 కప్పులు
అరటిపండ్లు : 2
గుమ్మడికాయ : ఒక టీస్పూన్ (ముక్కలు)

తయారీ :


పాలను కాచి చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. వెనీలాను కూడా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒక బౌల్‌లో హెవీ క్రీమ్, చక్కెరను బాగా బీట్ చేసి చిక్కటి ద్రవంలా చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని ముందుగా వెనీలా వాఫర్స్ వేయాలి. దానిపై నుంచి మూడు టేబుల్ స్పూన్ల హెవీ క్రీమ్ మిక్స్‌ని వేయాలి. ఆపై బనానా ైస్లెస్‌లను పేర్చాలి. ఇలా లేయర్లలా వేసుకుంటూ పోవాలి. దీన్ని గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి వెనీలా వేసి గుమ్మడికాయ, అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.


Easy-and-healthy-kids-desse

ప్రొజెన్ చాక్లెట్-బనానా బైట్స్

కావలసిన పదార్థాలు :


అరటిపండ్లు : 2
డార్క్ చాక్లెట్ : 100 గ్రా.
కొబ్బరి తురుము : 5గ్రా.
నట్స్ : 2

తయారీ :


అరటి పండ్లను సగానికి పైగా కట్ చేసుకోవాలి. వీటికి ఐస్‌క్రీమ్ పుల్లలు గుచ్చి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. డార్క్ చాక్లెట్‌ని మైక్రోవేవ్‌లో పెట్టి కరిగించాలి. ఇప్పుడు చల్లగా ఉన్న అరటి పండ్లను డార్క్‌చాక్లెట్‌లో ముంచాలి. దానిపై నుంచి రెండువైపులా కొబ్బరి తురుము, నట్స్‌ని చల్లాలి. మళ్లీ వీటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా ఆరగిస్తే చాలా బాగుంటాయి.

ZVLARGE

బనానా స్పిలిట్ బైట్స్

కావలసిన పదార్థాలు :


అరటిపండ్లు : 4
సెమీ స్వీట్ చాక్లెట్ : 4 గ్రా.
వెనీలా ఐస్‌క్రీమ్ : ఒక కప్పు
హెవీ క్రీమ్ : ఒక కప్పు
చక్కెర : ఒక టీస్పూన్
మల్టీకలర్ స్ప్రింకిల్స్ : తగినన్ని
చెర్రీ : 4

తయారీ :


అరటి పండ్లను 2 ఇంచుల పొడవుతో ఉండేవిధంగా కట్ చేయాలి. పైన, కింద సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ అరటి పండ్ల మధ్యలో చిన్న రంధ్రం చేసుకోవాలి. వీటిని వెనీలా ఐస్‌క్రీమ్‌లో వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. క్రీమ్, చక్కెరను బాగా మిక్స్ చేయాలి. అరటి పండ్లను బయటకు తీసి పై భాగంలో అందంగా డెకరేట్ చేయాలి. కరిగించిన ఐస్‌క్రీమ్‌లో మరో చివరను ముంచి స్ప్రింకిల్స్ అతికించి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత అరటి పండ్లను బయటకు తీసి చెర్రీలతో గార్నిష్ చేసి తినాలి.

bananacake

బనానా కేక్

కావలసిన పదార్థాలు :


అరటిపండ్లు : 3
బటర్ : 125 గ్రా.
చక్కెర : 150 గ్రా.
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ : ఒక టీస్పూన్
కోడిగుడ్డు : 1
మైదాపిండి : 190గ్రా.
పాలు : 60 మి.లీ.
క్రీమ్ : 50 గ్రా.
బాదాం పలుకులు : 10

తయారీ :


అరటి పండ్లను గుజ్జులా చేసుకోవాలి. ఒక పాన్‌లో బటర్‌ని కరిగించి చక్కెర, వెనీలా ఎసెన్స్‌ని వేయాలి. చక్కెర కరిగేవరకు సన్నని మంట ఉంచాలి. ఆ తర్వాత దించి చల్లారాక అరటిపండ్ల గుజ్జు, కోడిగుడ్డు తెల్ల సొనను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పాలు, మైదాపిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఈ మిశ్రమాన్ని కేక్ చేసే గిన్నెలో పోయాలి. 170 సెంటీగ్రేడ్‌ల వద్ద ఓవెన్‌లో బేక్ చేయాలి. కేక్ తయారయ్యాక బయటకు తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలపైన క్రీమ్ బాదాం పలుకుల ముక్కలను వేసి అందంగా గార్నిష్ చేస్తే టేస్టీ బనానా కేక్ రెడీ!

3545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles