ఆహార ఔషధాలు!


Wed,May 4, 2016 01:26 AM

vegetables ఆరోగ్యమే మహా భాగ్యం అనేది పాత నానుడే అయినా ఇప్పుడది అక్షరాల నిజం. ఎందుకంటే ఒక్కరోజు అనారోగ్యంతో సెలవు తీసుకున్నా మన జీవితంలో ఒక ఉత్పాదక రోజు తగ్గినట్టే కదా. పైగా అనారోగ్యాన్ని సరిచేసుకోవడానికి ఆసుపత్రులకు వెళ్లడం వల్ల మరింత ఖర్చు కూడా. ఏదైనా పెద్ద సమస్య అయితే ఇక సరేసరి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న సమస్యలను మనం రాకుండానే నివారించుకోవడం మంచిది. మన రోజువారీ ఆహార పదార్థాలే రకరకాల సమస్యలకు నివారణోపాయాలుగా పనికొస్తాయి. అదెలాగో చూడండి మరి.
తలనొప్పి
చేపలు ఎక్కువగా తినడం వల్ల తలనొప్పిని నివారించవచ్చు. అల్లం వాపు, నొప్పి నివారణిగా పని చేస్తుంది.
గుండెపోటు
టీ గుండెకు సంబంధించిన రక్తనాళాలలో కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది. తద్వారా గుండెపోటు నుంచి రక్షణ లభిస్తుంది.
నిద్రలేమి
తేనె తరచుగా తీసుకుంటూ ఉంటే నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. తేనె డిప్రెషన్, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
ఆస్తమా
ఎర్రని ఉల్లి ఆస్తమా తగ్గించడంలో ఎంతో ఉపయోగకరం. శ్వాసనాళాలు సన్నబడకుండా ఎర్ర ఉల్లి కాపాడుతుంది.
బీపీ
ఆలివ్ నూనెను వంటల్లో వాడడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఆలివ్‌నూనెలో ఉన్నటువంటి రసాయనాలనే సెలెరీలో కూడా గమనించారట. అంటే సెలరీని భోజనంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
బ్లడ్ షుగర్
క్రోమియం ఎక్కువగా లభించే పల్లీలు, బ్రాకోలిని తరచుగా తీసుకున్నట్టయితే బ్లడ్ షుగర్ ఎక్కువ తక్కువలు నమోదయ్యే వారికి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
ఆర్థరైటిస్
కొన్ని రకాల చేపలు తినడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా నివారించవచ్చు. ఎముకలు విరిగినపుడు, ఆస్టియోపోరొసిస్‌ను నివారించడానికి పైనాపిల్ చాలా మంచిది. దీనిలోని మాంగనీస్ ఎముకల పటుత్వానికి చాలా మంచిది.
పొట్ట బాలేకపోతే....
స్టమక్ అప్‌సెట్ అయినపుడు అరటి పండు మంచి మందుగా పని చేస్తుంది. అల్లం మార్నింగ్ సిక్‌నెస్, నీరసం నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
పీఎంస్
చాలా మంది మహిళలు నెలసరి ముందు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. తరచుగా కార్న్‌ఫ్లేక్స్ తీసుకోవడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.
దగ్గు
దగ్గు మందులో ఎర్రమిరప కాయల్లో ఉండే పదార్థాన్నే వాడుతారు. అందుకే దగ్గు తగ్గించడంలో మిరపకాయలది ప్రత్యేకస్థానం.
రొమ్ము క్యాన్సర్
గోధుమ పొట్టు, క్యాబేజిలో ఈస్ట్రోజన్ స్థాయిని నియంత్రించ గలిగే కారకాలు ఉంటాయి. ఈస్ట్రోజన్ స్థాయి నియంత్రణలో ఉంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం లేనట్టే.
ఊపిరితిత్తుల క్యాన్సర్
నారింజరంగు, ఆకుపచ్చ కూరగాయల్లో ఉండే బీటా కెరొటిన్, విటమిన్ ఏ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
అల్సర్లు
క్యాబేజిలో ఉండే రసాయనాలు అనేక రకాల అల్సర్ల నివారణకు తోడ్పడుతాయి.
డయేరియా
ఆపిల్ పొట్టు తీసి అది కొద్దిగా జేగురు రంగుకు మారిన తర్వాత తింటే డయేరియా లక్షణాలు తగ్గుముఖం పడుతాయి.

1960
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles