e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home ఆరోగ్యం ఆహారంతోనే పిల్లల ఆరోగ్యం

ఆహారంతోనే పిల్లల ఆరోగ్యం

కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్‌ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. ఇవే అలవాట్లను పిల్లలకూ నేర్పించాలి. వీటితోపాటు పోషకాహారం అవసరం. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మపోషకాలు చిన్నారుల ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

 • ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే పిల్లలకు పెట్టాలి. అప్పుడే వాళ్లు గట్‌ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. వీటితోపాటు పాలు, పెరుగు ఇవ్వాలి. విటమిన్‌-డి అందించే ఆహారం కూడా అవసరం.
 • ప్రాసెస్‌ చేసిన, కృత్రిమ రంగులు కలిపిన ఆహారానికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఎందుకంటే, నిల్వ ఆహారంలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. వాటికి బదులుగా నిమ్మరసంలో కీరా, పుదీనా, కొత్తిమీర వేసుకొని తాగితే రోజంతా బాడీ హైడ్రేట్‌ అవుతుంది. పిల్లలు రోజుకు 8 నుంచి 10 కప్పుల నీళ్లు తాగేలా చూడాలి. ద్రవాల్లోకూడా తియ్యదనం లేని పాలు, సిట్రస్‌ పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు అందించాలి.
 • కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల ఫ్యామిలీ టైమ్‌ పెరుగుతుంది. భోజన సమయంలో స్క్రీన్‌ టైమ్‌ తగ్గుతుంది.
 • పిల్లలకు ఆహారం విలువ తెలియాలి. వాళ్లు దాన్ని సంతోషంగా, కృతజ్ఞతా భావంతో తినాలి. అలాంటప్పుడే పిల్లల్లో సరైన ఎంజైమ్‌లు విడుదలై ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

పిల్లల డైట్‌ ప్లాన్‌కు ఓ ఉదాహరణ:

 • ఉదయం: నిద్ర లేచాక 5 నానబెట్టిన బాదం గింజలు + ఎండుద్రాక్ష నానబెట్టిన నీళ్లు 1 గ్లాసు.
 • బ్రేక్‌ఫాస్ట్‌: పాలకూర ఇడ్లీలు లేదా పాలకూర దోశె + పల్లీ చట్నీ లేదా సాంబారు.
 • మిడ్‌ మార్నింగ్‌: పసుపు కలిపిన పాలు/ మిరియాల పొడి చల్లిన, ఉడికించిన గుడ్డు.
 • లంచ్‌: మిక్స్‌డ్‌ వెజ్‌ పలావ్‌ లేదా సోయా కార్న్‌ పలావ్‌ + క్యారెట్‌ రైతా.
 • పోస్ట్‌ లంచ్‌: 5 బాదం గింజలు + 1 వాల్‌నట్‌ + 1 ఎండు ఖర్జూరం.
 • సాయంత్రం: సబ్జా గింజలతో బొప్పాయి స్మూతీ.
 • డిన్నర్‌: 2 క్యారెట్‌ రోటీలు లేదా 2 వామాకు రోటీలు.
 • రాత్రి నిద్రకు ముందు: పసుపు కలిపిన పాలు.

మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్‌,
www.trudiet.in

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana