ఆస్పిరిన్‌తో అల్జీమర్స్ తగ్గుతుందా?


Tue,September 4, 2018 12:01 AM

Aspirin-Alzheimer
అల్జీమర్స్ దెబ్బకు మేధావులు సైతం మతి తప్పిపోతున్నారు. గతమెంతో ఘనంగా ఉన్నా అల్జీమర్స్ దాన్ని గతి తప్పేట్లు చేస్తున్నది. వింత వ్యాధిగా చెలామణి అవుతూ విషాదం మిగులుస్తున్న అల్జీమర్స్‌కు ఆస్పిరిన్ చెక్ పెట్టగలదంటే నమ్ముతారా?


మామూలుగా ఆస్పిరిన్ జ్వరాన్ని నయంచేస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. మంటను మాయం చేస్తుంది. చాలామందికి ఇవే తెలుసు. వీటి నివారణ కోసమే ఆస్పిరిన్ బిళ్లలను వాడుతారు. అయితే పాథాలజీ కొత్తగా ఇంకో విషయం చెప్తున్నది. అదేంటంటే.. ఆస్పిరిన్ మెదడులోని మతిమరుపు ఫలకాలను తగ్గిస్తుంది. దీనివల్ల దీర్ఘకాల అల్జీమర్స్ కూడా తగ్గుతాయట. పాథాలజీలో ఇదొక నూతన ఒరవడి అనీ.. పూర్తిస్థాయిలో ప్రయోగాలు ఫలిస్తే ఆస్పిరిన్‌ను మించిన ఔషధం మరేదీ ఉండదని పరిశోధకుల అభిప్రాయం. సాధారణంగా అల్జీమర్స్‌ను ఎలాంటి ఔషధాలూ నివారించలేవు.

73
Tags

More News

VIRAL NEWS

Featured Articles