ఆస్తమాకు హోమియో


Tue,September 26, 2017 01:48 AM

www-homeoall
దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అని చెప్పవచ్చు. ఊపిరితిత్తులలో గాలి మార్గంలో అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. శ్వాస మార్గంలో వాపు వల్ల గాలి ప్రసరించే మార్గం కుంచించుకుపోతుంది. ఫలితంగా ఆస్తమా వస్తుంది.

ఆస్తమాకు కారణాలు ఏమిటి?

- చల్లని వాతావరణం. దుమ్ము, ధూళీ, పొగ, ఫంగస్, వాతావరణ కాలుష్యం. వైరల్, ఇన్‌ఫెక్షన్లు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు. పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటు వాసనలు.

ఆస్తమా ఎలా వస్తుంది?

ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించినది. కొంత మందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. దీనిని ఎటోపి అంటారు. కొంతమందిలో శరీరానికి సరిపడని యాంటీజెన్‌లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ యాంటీబాడీలు వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుంచి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది.అందువల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.

ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి?

- ఎడతెరిపి లేని దగ్గు, పిల్లి కూతలు, ఆయాసం, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన.

ఆస్తమా నిర్ధారణ పరీక్షలు ఏమిటి?

- అలర్జీకి సంబంధించిన పరీక్షలు. ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు, కఫం పరీక్ష, చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు, స్పైరో మెట్రీ, ఛాతి ఎక్స్‌రే.

reddy

ఆస్తమాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

- ప్రతిరోజూ వ్యాయామం చెయ్యడం, పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ శారీరక శ్రమ తేకుండా చూసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి దూరంగా ఉండడం. చల్లని వాతావరణంలో తిరగకుండా ఉండడం. సరిపడని ఆహార పదార్థాలు తీసుకోకపోవడం.

హోమియో చికిత్స ఏమిటి?

హోమియోపతిలో కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో మానసిక, శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం జరుగుతుంది. క్రమంగా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి వ్యాధిని మూలాల నుంచి తగ్గిస్తుంది.

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles