ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన గ్రామం


Thu,March 7, 2019 12:40 AM

పదిమంది నడిచిందే దారవుతుంది. అలాగే పదిమంది కలిసి చేస్తేనే సరైన ఫలితం వస్తుంది. తమ ఊరి బాగుకోసం అందరూ ఏకతాటిపై నిలిచి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకున్నారు. ఆసియా ఖండంలోనే శుభ్రమైన గ్రామంగా మార్చుకున్నారు.
cleanest-villageasia
ఆ గ్రామంలో అందరూ కలిసి కట్టుగా తమ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడమేకాకుండా పచ్చదనంతో తీర్చి దిద్ది ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు. క్లీన్ అండ్ గ్రీన్‌లో భారతదేశంలోనే కాదు ఆ గ్రామం ఇప్పుడు ఆసియాలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. కేవలం 500మంది జనాభా ఉన్న ఊరు అది. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మౌలినాంగ్ చాలా చిన్న గ్రామం. ఆ గ్రామమే ఇప్పుడు ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా ఎంపికైంది. అటు పచ్చదనంలోనూ, ఇటు పరిశుభ్రతలోనూ మౌలినాంగ్ గ్రామం అందరి ప్రశంసలు అందుకుంటున్నది. షిల్లాంగ్‌కు దాదాపు 100కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలినాంగ్ చిన్న గ్రామమే అయినా, అక్కడి ప్రకృతి సోయగాలు పలుకరిస్తుంటాయి. ప్రతి ఇంటి ముంగిట వెదురుతో చేసిన చెత్త బుట్ట కనిపిస్తుంటుంది. దారి వెంట పోయేవారికి చెత్తా చెదారం కనిపిస్తే చాలు ఆ బుట్టల్లో వేస్తుంటారు. చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా తమ ఊరిని బాగు చేసుకున్నారు. అక్కడ ఇండ్లను వెదురుతోనే నిర్మించుకుని పర్యావరణ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. విశేషమేమిటంటే మౌలినాంగ్ గ్రామంలో 85 అడుగుల ఎత్తులో వెదురు కర్రలతో నిర్మించిన టవర్‌పై ఎక్కితే అక్కడి రమణీయమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, దానిపై నిలుచుంటే బంగ్లాదేశ్ కూడా కనిపిస్తుంటుంది.

408
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles