ఆవిష్కరణ కోసం.. వ్యర్థాలను వెతుకులాడింది.


Fri,February 22, 2019 12:12 AM

ఆలోచనలే ఆవిష్కరణకు మూలం. అలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలంటే విలువైన ముడిసరుకే అవసరం లేదు. చెత్త నుంచి కూడా కళాత్మకమైన ఆవిష్కరణలు చేయొచ్చు. అలాగే చేసింది ఓ మహిళ...
veena
పాత బట్టలతో టైల్స్, టైర్లతో స్టీల్ తయారు చేయొచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? వ్యర్థాలుగా మారే బట్టలను విలువైన వస్తువులుగా తయారు చేయొచ్చని తెలుసా? ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి పాత వాటిని ఎలా వాడుకోవచ్చో మీ ఊహకు ఎప్పుడైనా అందిందా? ప్రపంచ వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వినియోగించే ఆవిష్కరణ చేసింది వీణా సహజ్వాల.. యూఎన్‌ఎస్‌డబ్లూ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్. ఆస్ట్రేలియాలో పాత దుస్తులను ఉపయోగించి ఫ్లోరింగ్, గోడ నిర్మాణ వస్తువులు రూపొందించే ఎస్‌ఎంఎఆర్‌టి (సైస్టెనబుల్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ)కి డైరెక్టర్. ప్రపంచ వ్యాప్తంగా 920లక్షల టన్నుల వస్ర్తాలు వ్యర్థమవుతున్నాయని ఓ అంచనా.

వీణా బృందం అంతా కలిసి ఈ పాత బట్టలు, యూనిఫాంలు, పరుపు, దుప్పట్లన్నింటినీ సేకరించి పని ప్రారంభించారు. పాలీమర్ వస్తువు, షాపింగ్ సంచులు, వాడని లాబ్ కోట్లు తీసుకొని వాటికి ఉండే ప్యాంట్ జిప్, బటన్ల్లను ముందుగానే తొలిగించి.. ఉన్ని, పత్తి, థర్మోప్లాస్టిక్‌ని సౌకర్యవంతమైన వస్తువులుగా రూపొందిస్తారు. వీటన్నిటినీ ఉపయోగించి సాంకేతిక పరిజానాన్ని తీసుకురావొచ్చట. ముంబైలో పెరిగిపోతున్న రీసైక్లింగ్ గురించి తెలుసుకున్న ఆమె తన అభిరుచిని అది ప్రభావితం చేసింది. ఐఐటీ కాన్పూర్ అల్మా మేటర్‌లో బలమైన పునాదులు నిర్మించింది. ఐఐటీలో హార్డ్‌వర్క్ నేర్చుకున్నది. అదే పరిశోధన వృత్తిలో ఉపయోగపడిందని వీణా చెబుతున్నది. పాత బట్టల నుంచి టైల్స్ రూపొందించడానికి ముందు ప్రొఫెసర్, తన టీమ్ రబ్బరు టైర్లని రీసైకిల్ చేయడం ద్వారా ఆకుపచ్చ ఉక్కు ఉత్పత్తి చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఉక్కు తయారీలో బొగ్గు వినియోగం తగ్గించాలని వాదనలు వచ్చాయి. మరొక పరిశోధనలో ఎస్‌మార్ట్ బృందం రూపొందించిన ఒక నమూనా టెక్నాలజీ రీసైకిల్ చేసిన గ్లాసును అధిక నాణ్యత సిరామిక్స్, టైల్స్‌లో ఉపయోగించవచ్చని తెలిపింది. వంటగది, బాత్‌రూమ్‌కి వాడే అన్ని రకాల పరిమాణాల టైల్స్, అన్ని రంగుల్లో వస్తాయని చేసి చూపించింది. వ్యర్థాలను ఉపయోగించి టైల్స్‌ను, టైర్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా స్టీల్‌ను తయారు చేయడం కొనసాగిస్తున్నది వీణ.
veena1

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles