ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎలా?


Sat,December 29, 2018 12:27 AM

TORGET
భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగా అంచనావేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఆర్థిక అవసరాలు ఎలావుంటాయో చెప్పడం అంత సులువుకాదు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా భవిష్యత్తును అంచనావేయడం కష్టతరంకానున్నది. ఇదే సమయంలో భావోద్వేగాలు, సంక్లిష్టత, భవిష్యత్తును అంచనావేస్తూనే ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అప్పుడే అత్యవసర సమయంలో పొదుపు చేసిన డబ్బు ఎంతో ఉపయోగపడనున్నది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఎంత కష్టమో..డబ్బును సంపాదించడం కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. సంపాదించిన మొత్తం నీళ్లలాగా ఖర్చు పెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు మరి. తాము సంపాదించిన మొత్తంలో 15 శాతం కంటే ఎక్కువగా పలు రూపాల్లో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాలను చేర్చడానికి ఈ పొదుపు చర్యలు ఎంతో దోహదం చేయనున్నాయని, ముఖ్యంగా వారి ఆర్థిక ప్రణాళికతో ప్రేరణ, సంతృప్తి పొందేందుకు వీలుంటుంది. పెట్టుబడిదారులు పెట్టుకున్న లక్ష్యాలే విజయాలకు దిశానిర్దేశం చేస్తాయి..లక్ష్యంమేరకు పెట్టుబడులు పెడితే వారు అనుకున్నదాంట్లో గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలకు పరిష్కారం లభించిందా అని పెట్టుబడిదారులను అడిగితే..దీర్ఘకాలికంగా పెట్టుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి కొంతమేర ప్రయాణించాను చెబుతున్నారనే వారి సంఖ్య అధికం.. నిజమైన లక్ష్యాల్లో ఆర్థిక లక్ష్యాలు కీలకపాత్ర పోషించనున్నాయని, ఇవే వారి ప్రాధాన్యతలు, ప్రేరణలను సూచిస్తాయి.

లక్ష్యాలకు ఎదురుదెబ్బ..

ప్రతి ఒక్కరు తన ప్రవర్తన ఆధారంగా లక్ష్యాలను మార్చుకోవడం పరిపాటి. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో భవిష్యత్తు కోరికలకు నాంది పడనున్నది. అత్యధిక మంది పెట్టుబడిదారులు షార్ట్‌కట్ రూట్‌లో లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు..కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల స్వల్పకాలంలో ఊరట లభించనున్నప్పటికీ..దీర్ఘకాలికంగా ఇది చెడు చేయనున్నది. ఉదాహరణకు పెట్టుబడిదారుడు ఒక గృహ ప్రవేశ పార్టీకి హాజరయ్యారనుకో, అదే సమయంలో ఇలాంటి విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి దీనికి అధిక ప్రాధాన్యతనిస్తూ, దీనిని మరిచిపోడు. ఇలాంటి సమయాల్లో షార్ట్‌కట్స్‌లో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేయాలి. సరైన మార్గదర్శకత్వం లేకుండా వ్యక్తిగతంగా భారీ లక్ష్యాలను నిర్దేశించుకోకూడదు. ఒక్కసారి కుదుపునకు గురైతే మొత్తం ఆర్థిక ప్రణాళికపై పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది.

ప్రమాదాల నుంచి తప్పించుకోవడం..

లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీటిని తప్పించుకుంటూ తాను నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేయాలి. జాబితాలో పెట్టుకున్న లక్ష్యాల్లో ఆర్థిక గోల్స్‌కు పెద్దపీట వేయాలి. చదువు, కోరిక, ఇతర ఏదైన ఇష్టం లక్ష్యాలతో పోలిస్తే ఆర్థిక లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రస్తుత సంవత్సరం ముగుస్తున్నది. నూతన సంవత్సరంలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకుండి. వీటికి అనుగుణంగా నడుచుకోండి. ఆ తర్వాత విజయం సాధిస్తే దానిలో ఉండే గొప్ప, సంబరం ఎదో తెలియని కిక్కునిస్తున్నది. మాస్టర్ జాబితాలో పెట్టుకున్న తొలి గోల్స్‌లో 26 శాతం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండగా, మిగతా 73 శాతం యధావిధిగా ఉండనున్నాయి. ఒకవేళ గతంలో పెట్టుకున్న లక్ష్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే పెట్టుబడిదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అభిరుచిలకు తగ్గట్టుగానే అధికమంది మార్పులు చేసుకుంటారని, వివరణాత్మకంగా, మానసికంగా సిద్దపడాల్సి ఉంటుంది.

పదునుపై ప్రత్యేక దృష్టి..

ఒకవేళ టాప్ గోల్స్‌ను మార్చుకున్న పెట్టుబడిదారులు 27 శాతం ప్రత్యేక వాటిపై దృష్టి సారిస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము పెట్టుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతాదో అత్యధిక మంది పెట్టుబడిదారులకు మరింత స్పష్టత ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. తిరిగి చెల్లింపులు జరిపేసత్తా ఉన్నవారు మాత్రమే రుణాలు తీసుకోవాలి. లేకుంటే అప్పు చేసి చిప్ప కూడు తినేటట్టు వ్యవహరించడం అంత మంచిది కాదు. అవుట్‌కమ్ ఆధారంగా తమ గోల్స్ మార్చుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.

479
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles