ఆరోగ్యానికి తులసి..


Sun,April 7, 2019 10:17 PM

తులసి చెట్టును దైవంగా భావించి పూజిస్తారు. అంతే కాకుండా తులసి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఆరోగ్యం పరంగా, చర్మ సంరక్షణ పరంగా తులసి పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే తులసి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
tulsi
-తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ విత్తనాలు రోజూ తింటుంటే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి.
-తులసి విత్తనాలను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గ్లాస్ పాలలో కలిపి రోజూ తాగుతుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దాంతో పాటు రక్తనాళాల్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే చాలా మందికి వయసు పెరిగే కొద్ది చర్మం ముడతలుగా మారుతుంది. ఈ సమస్యను తొలిగించాలంటే నిత్యం తులసి విత్తనాలు తింటుండాలి.
-తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనెతో గానీ, పెరుగుతో గానీ కలిపి తీసుకుంటే అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరిగడుపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు తీసుకుంటే మరీ మంచిది.
-మలేరియా వచ్చినప్పుడు 5 నుంచి ఏడు తులసి ఆకుల్ని నలిపి మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు. తులసి రసం, అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజు 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
-పిల్లలు వాంతులు చేసుకుంటుంటే టానిక్‌లు అనీ, ట్యాబ్లెట్లు అనీ చాలా మంది విపరీతమైన మెడిసిన్ వేస్తారు కానీ కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి ఇస్తే వాంతులు తగ్గుతాయి. తులసి ఆకులను నీళ్లలో మరిగించి ఆ నీటిని సేవిస్తే చెవినొప్పి నుంచి బయటపడవచ్చు.

742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles