ఆరోగ్యం.. భాగ్యం..


Sat,March 2, 2019 12:18 AM

ఇంటికి ఈశాన్యం తెరిచి ఉంచాలనీ.. నైరుతి వైపు మూసివేయటం మంచిదనీ వాస్తు ఎందుకు సూచిస్తుంది? నైరుతి దిశలోనే వాటర్ ట్యాంకులు, బరువైన వస్తువులు పెట్టుకోవాలని ఎందుకు చెబుతోంది? ఇందుకు శాస్త్రీయంగా ఏమైనా కారణం ఉందా? వట్టి మూఢనమ్మకమేనా?
TS-Budgets

ప్రమోటర్లకు నోటీసులు

చెక్కుచెదరని విశ్వాసంతో కొందరు.. భయంతో మరి కొందరు వాస్తును ఆశ్రయిస్తుంటారు. నిర్మాణ రంగంలో ఢక్కామొక్కీలు తిన్నవారిది ఇంకో ధోరణి. వాస్తు నిబంధనల్ని పాటించకపోతే అమ్ముకోవడం కష్టమనేది వీరి భావన. ఏదైనప్పటికీ పాటించే వారిలో చాలామందికి వాస్తు సూత్రాల వెనక శాస్త్రీయమైన కారణాలు తెలియవు. వాస్తు నిపుణులమని చెప్పుకునేవారిలో ఎక్కువ మందికి అస్సలే తెలియదు. నేచురల్ ఎనర్జీ.. అదే ప్రకృతి శక్తి. ప్రసరించే దిశను బట్టి సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ). ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) అని రెండు రకాలు. భారతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రకృతిశక్తులకు అనుగుణంగా గృహనిర్మాణాన్ని సూచించేదే వాస్తు శాస్త్రం. మనదేశ పరిస్థితులను బట్టి ఈశాన్య (నార్త్ ఈస్ట్) దిశ నుంచి గరిష్ఠ స్థాయిలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈశాన్య దిశను మూసివేస్తే ఈ శక్తి మనకు దూరమవుతుంది. అందుకే, ఈశాన్య దిశను పూర్తిగా మూసివేయకూడదని వాస్తు చెప్పింది. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే, నైరుతి (సౌత్ వెస్ట్) దిశలో అన్నమాట. అస్తమించే సూర్యకిరణాల తీక్షణ బాగా ఎక్కువ. అస్తమించే సూర్యకాంతిలో శరీరానికి హాని కలిగించే అతినీలలలోహిత కిరణాలు ఎక్కువుంటాయి. సాధారణంగా, పడక గదులు ఈ దిశలోనే ఉంటాయి. ప్రతికూల శక్తిని అడ్డుకోవడానికే నైరుతి దిశను మూసివేయాలని, బరువైన వస్తువులను ఈ దిశలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం నిబంధన విధించింది.

ఆరోగ్యానికి ఆలంబన..
వాస్తు శాస్త్రం ముఖ్య లక్ష్యం.. ఆరోగ్యం. మెదడుపైనా, శరీరంపైనా సూర్మరశ్మి, భూ ఆయస్కాంత శక్తి చూపే ప్రభావం అంతాఇంతా కాదు. జీవితంలో ఎక్కువ కాలం ప్రతికూల శక్తి కింద జీవించేవారికి ఆరోగ్యం మృగ్యమే. రోజంతా ఎర్రటి ఎండలో తిరిగితే ఏమవుతుంది? ప్రధాన ప్రాకృతిక శక్తులు అయిదు (పంచభూతాలు) అయినా వాస్తు నాలుగు అంశాలకు పెద్దపీట వేస్తుంది. మొదటిది, భూఆయస్కాంత శక్తి, వాస్తు శాస్త్రంలో దాదాపు 45 సూత్రాలు ఈ శక్తికి సంబంధించినవే. మన శరీరం అంతా రక్తమే. రక్తంలో ఉండేది హిమోగ్లోబిన్. అంటే, ఇనుము. ఇనుముపై ఆయస్కాంత ప్రభావం ఉంటుందనేది చిన్న పిల్లలకూ తెలిసిన విషయమే. శరీరంలో రక్త ప్రవాహాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. రెండోది, సౌరశక్తి. వాస్తు శాస్త్రంలో 40 శాతం సూత్రాలు ఈ శక్తికి సంబంధించినవే. భూమధ్య రేఖకు ఎంత దగ్గరలో ఉంటే ప్రతికూల సౌరశక్తి ప్రభావం అంత ఎక్కువుంటుంది. మూడోది గురుత్వాకర్షణ శక్తి. వాస్తు శాస్త్రంలోని సుమారు 7-8 శాతం సూత్రాలు ఈ శక్తి గురించి వివరిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే.. ఈ శక్తిని అధిగమించేలా నిర్మాణాలు చేపట్టడం సాధ్యమే.

-ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వంటి కృత్రిమ సాధనాలపైన ఆధారపడటం తప్పనిసరి అయిన ఈ రోజుల్లో ప్రకృతి సిద్ధమైన వాయుశక్తి నుంచి ప్రయోజనం పొందే అవకాశం తక్కువే.

-వాస్తు శాస్త్రంలో సిరిసంపదల గురించి ప్రస్తావించింది. కొన్ని సూత్రాలు పాటిస్తే సంపద కలుగుతుందని సూచించింది. అందులో పరమార్థం ఏమీ లేదు. వాస్తు సూత్రాలు ఆరోగ్యానికి బాట వేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి తెలుసు కదా. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ఎంతో ఆరోగ్యంతో విలసిల్లుతుంది. ఆరోగ్యవంతమైన మస్తిష్కం మరింత సమర్థంగా పని చేయగల్గుతుంది. అంతే ఇంతకు మంచి ఈ సూత్రాల్లో రహస్యం ఏమీ లేదు.

-లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి వాస్తుపై నమ్మకం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ఒక్కటే. అది సూచించే దిశలు ఒక్కటే. అయినప్పటికీ, అన్ని దేశాలకు ఒకేలా వర్తించదు. మనదేశంలో ఈశాన్య దిశ నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటే మరో దేశంలో ఇదే దిశ నుంచి ప్రతికూల శక్తి వస్తుండే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాలు, సూర్యుడు, భూగమనం, పవనాల దిశ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాస్తు అన్వయించుకోవాలి.

507
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles