ఆయిల్ స్కిన్‌కి చెక్ పెట్టండి!


Mon,March 18, 2019 12:53 AM

skincare
-కలబంద మెడిసినల్ ప్లాంట్. అలోవెరా జెల్‌ను చర్మానికి రాయాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రపరుచాలి. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్‌ను గ్రహించి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది.
-రోజులో ఒక్కసారైనా ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా వరకు ఆయిల్ స్కిన్‌ని నివారించవచ్చు.
-యాపిల్, ఆరెంజ్ వంటివి చర్మంలోని ఆయిల్‌ని గ్రహిస్తాయి. సిట్రస్ పండ్లలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉంటాయి. దాంతో చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
-యాపిల్ సైడర్ వెనిగర్‌ను టోనర్‌గా ఉపయోగించడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించవచ్చు. ఇది చర్మంలోని బ్యాక్టీరియాని నాశనం చేయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య ఉండదు.
-కోడిగుడ్డులోని తెల్లసొనతో ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

301
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles