ఆయనకిది కంఠస్థం, మరి మీకు?


Fri,February 8, 2019 01:16 AM

nerchukundam
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఇటీవల జరిగిన ఒక ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమంలో మాజీ డిజిపి పేర్వారం రాములు ఆహుతులకు అలవోకగా వినిపించిన పలు మధుర పద్యాలలో ఇదొకటి. శ్రీ రామచంద్రమూర్తిని అద్భుతంగా స్తుతించడమే ఇందులోని అర్థ పరమార్థం. శ్రీ మదాంధ్ర భాగవతం, దశమస్కంధం (పూర్వభాగం)లోని మొదటి పద్యంగా ఆయన దీనిని పేర్కొన్నారు. ఈ పద్యాన్ని కంఠతా చదువుతుంటే వినే వారికి మృదుమధురంగా ఉంటుంది. ఆసక్తిగల పాఠకులు పలుమార్లు చదివి నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే దీనిని ప్రచురిస్తున్నాం.


ప్రపంచాన్ని ఆంగ్లభాష ఏలుతున్న ప్రస్తుత తరుణంలో మనదైన భాషను, సంస్కృతిని కనీసం మన ముందు తరాల వారి కోసం కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఆలోచించండి. పాఠకుల్లో ఎవరికైనా సరే, భారతీయ ధార్మిక సంబంధ పద్యాలు ఏవైనా కంఠస్థంగా వచ్చి వుంటే ఇంకెందుకు ఆలస్యం! మాకు రాసి పంపండి. ఇదుగో..ఇక్కడే మీ ప్రతిభను గౌరవమిస్తాం.

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles