ఆమె పాత్రను అర్థం చేసుకోవాలి!


Thu,January 31, 2019 12:31 AM

ఆధునిక సమాజంలో నిజమైన సమానత్వాన్ని సాధించడానికి, దేశాభివృద్ధికి పునాది వేసి, చరిత్రలో నిలిచిన మహిళల పాత్రను నేటి తరానికి అందించాలి. ఈ ఉద్దేశ్యంతోనే ఓ తల్లి తన కూతురి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది.
woman-india
అత్యంత ప్రభావశీల, ఆదర్శమైన మహిళలు మన దేశంలో ఎందుకుండరమ్మా అని ఓ ఏడేండ్ల పాప తన తల్లిని అడిగిన ప్రశ్నకు ఆ తల్లి చలించిపోయింది. మన దేశంలో గొప్ప మహిళల గురించి ఈ తరానికి ఎలా తెలియాలి అని ఆలోచించింది. అధ్యయనం చేసింది. పుస్తకాలను, వ్యాసాలను, బొమ్మలను సేకరించింది. ఉమెన్ ఇన్ సైన్స్, గుడ్‌నైట్‌స్టోరీస్ ఫర్ రెబెల్ గర్ల్స్, రెబల్ లేడీస్ హు రాక్డ్‌ద వరల్డ్ వంటి పుస్తకాలను సేకరించింది. వాటిని పూర్తిగా చదివి తన కూతురికి వివరించింది. ఇలాంటి పుస్తకాలను పిల్లలు చదవాలనుకుంది. ప్రభావశీలురైన మహిళల పెయింటింగ్‌లు, డాక్యుమెంటరీలు, సూక్తులు సేకరించి పిల్లలతో వల్లె వేయించింది. సెలవుల రోజుల్లో వాటితోనే గడిపింది. డాక్టర్ వర్దన శివ, సావిత్రి బాయి, కేసర్బి కేర్కర్, థెస్సి థామ్సన్, శకుంతలాదేవి, మందాకిని, బేగం హజ్రత్ వంటి మహిళల చిత్రాలతో ఆమె కూతురికి అవగాహన కల్పించింది. ఇలా తన ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నది. భారతదేశంలో మహిళల గొప్పతనాన్ని నేటి పిల్లలకు వివరించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నది.

580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles