ఆమె నడిచొచ్చిన తొవ్వ..


Mon,April 15, 2019 11:47 PM

చదువుల కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. కానీ ఆమె నగర జీవితాన్ని అనుభవించాలనుకోలేదు. ఒకింత విసుగు చెందిన భావనతో ఆమె పల్లెటూర్ల బాట పట్టింది. ఆమె వెళ్లిన ఆ తొవ్వలో ఎంతోమందికి ఉపాధి దొరికింది, పర్యాటకులకు వసతి దొరికింది.
nitya
నిత్య ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన అమ్మాయి. నాన్న నవీన్‌కు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. నవీన్ ఎప్పుడు బయటకు వెళ్లినా నిత్య కూడా అతనితో వెళ్లేది. పట్టణానికి దూరంగా వెళ్లి గుట్టలు, సెలయేర్లు, జలపాతాల్లో గడిపేవారు. అలా నిత్యకు నేచర్ మీద ఆసక్తి పెరిగింది. వాళ్ల నాన్నకున్న అలవాటు వల్ల కుటుంబం అంతా నైనటాల్‌ను వదిలేసి సత్తల్ అనే గ్రామానికి వచ్చారు. అక్కడ కొంత భూమిని కొని ఇండ్లు నిర్మించుకున్నారు. కొన్ని కాటేజ్‌లనూ నిర్మించారు. కొన్నాళ్ల తర్వాత నవీన్ మృతి చెందాడు. నిత్యను అది కలచివేసింది. కానీ వాళ్ల నాన్న నుంచి వచ్చిన వ్యక్తిత్వంతో ప్రకృతితో సంబంధాన్ని కోల్పోకుండా చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, స్టార్టప్స్‌లో ఉద్యోగాలు వచ్చిన వాటిని వదులుకొని గ్రామాల్లో జీవించడానికి ఇష్టపడింది. చివరికి సత్తర్‌లోనే ఓ కేఫ్‌ను ఏర్పాటు చేసింది. కాటేజ్‌లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. వాణిజ్యపరంగా కాకుండా పర్యాటకులకు వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆమె కేఫ్‌ను, కాటేజ్‌లను నడిపిస్తున్నది. దీనికి వారి అమ్మ, సోదరుడు సాయం అందించారు. ఆ తర్వాత సత్తర్ గ్రామంలోని పాఠశాలను దత్తత తీసుకున్నారు. విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారి చొరవను చూసిన గ్రామస్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఇప్పుడు నిత్యకు 15 మంది టీంతోడైంది. సుమారు 50 మందికి పైగా గ్రామస్తులకు ఆమె కాటేజ్‌లో ఉపాధి కల్పించింది. ఇలా గడపడం నాకు ఇష్టం. ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడి ప్రజలు మా ఇండ్లకు రావడం తృప్తిగా ఉంది అంటున్నది నిత్య.

262
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles