ఆమె ధైర్యానికి బదిలీలే పురస్కారాలు


Fri,February 22, 2019 12:11 AM

ఎవరైనా అధికారి ధైర్యంగా అక్రమాలను ఎదిరిస్తే వారికి ఇరవై నాలుగు గంటల్లో ్రట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చి చేరడం సినిమాల్లోనే చూస్తాం. కానీ ఆ ఐఏఎస్ అధికారిణికి కూడా అలాగే జరిగింది.
ias
రాజస్థాన్‌లో ఝుంఝును అనేది ఒక చిన్న జిల్లా. ఆ జిల్లాకు కలెక్టర్ ముగ్దా సిన్హా. 1999వ బ్యాచ్. పేరుకు తగ్గటే ఆమె అక్రమార్కుల పట్ల కొదమ సింహం. ఆమె 15 యేండ్ల సర్వీస్‌లో 13 ట్రాన్స్‌ఫర్లను ఎదుర్కొంది. ఎక్కడ అవినీతి, అక్రమాలు జరిగినా ఆమె నిమిషాల్లో ఉండేది. ప్రజలకు రక్షణ కోసం రాత్రింబవళ్లూ లేక్క చేయకుండా విధుల్లో ఉంటుంది. ఝుంఝును విషయానికి వస్తే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 63 యేండ్ల తర్వాత మొదటి సారి ఓ మహిళా కలెక్టర్ ఆ జిల్లాకు విధులు చేపట్టింది. ఇంతవరకు అక్కడ ఏ మహిళా అధికారిణికి పోస్టింగ్ ఇవ్వలేదు. తొలిసారి సిన్హా అక్కడ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంది. అయితే విషయం ఏంటి అంటారా? అది పేరుకే చిన్న జిల్లా.. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని అవినీతి, అక్రమాలు అక్కడే జరుగుతాయని వినికిడి. మైనింగ్, బ్లాస్టింగ్, ఇసుక మాఫియా, డ్రగ్స్ ఇలా అన్ని అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్.. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించాలంటే ఇక్కడున్న అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ఉండేవారు.

కానీ సిన్హా రంగంలోకి దిగాక పరిస్థితులు మారిపోయాయి. మైనింగ్‌ను మట్టుపెట్టడానికి నడుంబిగించింది. మైనింగ్ వ్యాపారుల చేతుల్లో బాధితులుగా ఉన్న ప్రజలకు అండగా నిలిచింది. రాత్రుళ్లు అక్కడి ప్రజలకు నేరుగా అందుబాటులోకి ఉండేందుకు ఫోన్ నంబర్‌ను అందరికీ ఇచ్చింది. రాత్రిళ్లు వచ్చే ఫోన్లను అస్సలే నిర్లక్ష్యం చేసేది కాదు. అమ్మా మమ్మల్ని రక్షించండి, మా ప్రాణాలు తీస్తున్నారు అనే గొంతులు అప్పుడప్పుడు రాత్రి ఫోన్లలో వినబడేవి. వెంటనే స్థానిక అధికారులను, తహసిల్దార్‌ను అలర్ట్ చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వివరాలు తెలుసుకునేది. ఈమె తీసుకున్న నిర్ణయాలకు చివరికి మైనింగ్, ఇసుక మాఫియా మొత్తం 2010లో నిర్మూలన అయింది. సిన్హా ఉదయ్‌పూర్‌లో మొదట సబ్‌డివిజన్ ఆఫీసర్‌గా చేరి తర్వాత జైపూర్‌లో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించింది. తర్వాత కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొంది సీఎంఓలో పని చేసింది. ఐఏఎస్ అనేది ఉద్యోగం కాదు. ఇదొక సేవా. ఉద్యోగం చేయడానికి సమర్థవంతంగా ఎవరైనా శిక్షణ తీసుకుంటారు కానీ నిజాయితీ అనేది అతర్లీనంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతను చాటుకోవాలి. ప్రజల హృదయాల్లో, మనసుల్లో నేను చేసే పని నిలిచి ఉంటుంది అంటున్నది సిన్హా...

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles