ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి


Sat,March 30, 2019 01:11 AM

చెత్తను కండ్లతో చూస్తే చెత్తనే కనిపిస్తుంది కానీ మనసుతో చూస్తే అద్భుతాలు కనిపిస్తాయి.పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లను, గాజు సీసాలను సేకరించి పర్యావరణ పరిశుభ్రతను, సృజనాత్మకతను ఒకే గొడుగు కిందికి తెచ్చింది కేరళకు చెందిన అపర్ణ.
aprna
చిన్నతనం నుంచి కళల మీద, సృజనాత్మకత మీద అపర్ణకు ఆసక్తి ఉంది. ఇంట్లో పేపర్లతో, పనికిరాని వస్తువులతో కళారూపాలను తయారు చేసేది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను జువెలరీ డిజైనింగ్ వైపు ప్రోత్సహించారు. ఆమె తయారు చేసిన వాటికి ఫ్రెండ్స్ నుంచి స్పందన వచ్చేది. జువెలరీ డిజైన్ల తయారీకి ఫ్రెండ్స్ ఆర్డర్లు ఇచ్చేవారు. సంవత్సరం తర్వాత ఆమె తన శైలిని మార్చింది. ఇంకా వినూత్నంగా చేయాలనుకున్నది. ఈ క్రమంలోనే ఆమె ఇంటి ముందు మురుగు గుంటలో నీరు ఇబ్బందిగా కనిపించింది. అది సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లతో నిండి ఉండేది. దీన్ని తరుచూ గమనించిన అపర్ణ వాటి నుంచే కళారూపాలు తయారు చేయాలనుకుంది. మొదట కొన్ని సీసాలు, బాటిళ్లు తీసుకువచ్చి వాటిని శుభ్ర పరిచింది. వాటిపై పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన దస్తూరితో ప్రాంతీయ భాషలో కొటేషన్లు రాసింది. వాటిని ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేసింది. వాటికి ఊహించని స్పందన రావడంతో అదే పనిగా తన అభిరుచిని కొనసాగించింది. ఒక రోజు ఫ్రెండ్స్ అందరితో సిటీ రోడ్లలో, మురుగు కాలువల్లో ఉన్న బాటిళ్లను, సీసాలను సేకరించేందుకు ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టింది. ఫ్రెండ్స్ చొరవను చూసిన స్థానికులు సైతం ఈ డ్రైవ్‌లో పాల్గొని ఆమెకు సాయం అందించారు. కేవలం సీసాలను సేకరించడమే కాకుండా వ్యర్థాలను తొలిగించి, పరిసరాలను శుభ్రపరచడం వరకూ వెళ్లింది ఈ డ్రైవ్. ఇలా సేకరించిన వస్తువులను కళాఖండాలుగా తయారు చేసి విక్రయిన్నది అపర్ణ.

610
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles