ఆధునిక పోకడ తెలివైన బంతి


Tue,January 29, 2019 12:19 AM

మన చేతి పిడికిలి పట్టు సామర్థ్యాన్ని కొలిచే తెలివైన బంతిని నిపుణులు అభివృద్ధి పరిచారు. కండర శక్తిని పెంచుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
Aadhunika-Pokada
చిన్న పిడికిలే కదాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే, అది ఒంట్లోని శక్తిని సూచిస్తుంది. రోజు వారీగా అనేక బరువులను మోయడానికి మన చేతి పిడికిళ్లే ఆధారం. ఈ క్రమంలో దాని సామర్థ్యాన్ని గుర్తెరిగి మెదలడం వల్ల మేలు జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. స్కెగ్ (Squegg) పేరుతో అమెరికాలో వెలుగులోకి వచ్చిన స్మార్ట్ స్కీజ్ బాల్ (squeeze ball) పనితనానికి, తెలివితేటలకు తక్కువేమీ లేదు. దీనిలోని ప్రెషర్ సెన్సర్లు పిడికిలి పట్టులోని బిగువును, అదీ ఎన్నిసార్లు బిగించిందీ కొలుస్తుంది. బ్లూ టూత్ మాడ్యూల్‌తో ఆ సమాచారాన్ని చక్కగా మన స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. అది పౌండ్లలో లేదా కేజీలలో ప్రదర్శితమవుతుంది. దీని తాలూకు ప్రత్యేక యాప్ ద్వారా బిగింపు సామర్థ్యపు నిర్మాణ విధానాన్ని కూడా సమయానుకూలంగా తెలుసుకోవచ్చునని, తద్వారా వర్కవుట్స్‌ను రూపొందించుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.
Aadhunika
చూడడానికి అందమైన సబ్బు బిల్లలా కనిపించే ఈ సొగసైన పరికరం 66 గ్రాముల బరువుతో జల నిరోధక (వాటర్ రెసిస్టెంట్) గుణాన్ని కలిగి ఉంటుంది. దీని లిథియమ్ బ్యాటరీని 2 గంటలపాటు చార్జింగ్ చేసుకొని వాడుకొంటే సుమారు 80 గంటల పాటు స్కెగ్ పనిచేస్తుంది. ప్రస్తుతానికి రెండు రంగుల్లో లభ్యమవుతున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరం వెల రిటైల్ మార్కెట్లో సుమారు 39 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles