ఆదిమ జంతువు ఆనవాళ్లు


Tue,January 29, 2019 12:26 AM

-పురాజంతు శాస్త్రం
సుమారు 600 మిలియన్ ఏండ్ల కిందటి శిలల్లో అతిప్రాచీన జంతువు శిలాజాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇది కాంబ్ జెల్లీ ఫిష్ లక్షణాలను పోలి ఉన్నట్టు వారంటున్నారు.
Sajeeva-Shastram
పురాతన అవశేషాలకు పేరెన్నికగన్న చైనాలోని డోషంట్యో ఫార్మేషన్ (Doushantuo Formation) నుండి సేకరించిన ఒక బరమా (డ్రిల్)కు చెందిన ఓ ప్రధాన పరికరంపై కనుగొన్న శిలాజం అతిప్రాచీన కాలానికి చెందిన గుండ్రటి చుక్క వంటి (blob-like) ముంజచేప (జెల్లీ ఫిష్)కు చెందినదై ఉందని శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. భూమి మీది అతిప్రాచీన (541 మిలియన్ ఏండ్ల కిందటి) జంతువు శిలాజంగా ఇప్పటికి భావిస్తున్న డికిన్‌సోనియా (Dickinsonia) కంటే కూడా ఇది 40 మిలియన్ సంవత్సరాలు పాతదని వారన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ కొత్త ఆదిమ జంతువు 0.7 మి.మీ. చుట్టుకొలతను కలిగి ఉందని, దీని ఆకారం ముంజచేపను పోలి ఉందని వుహాన్ నగరంలోని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్స్ పరిశోధకురాలు డా॥ ఝెంబింగ్ షీ తెలిపారు. దీనికి స్పర్శకాలు, కణజాలం, నాడీకణాలు, బీజగ్రంథులు, శ్లేష్మపొరలు, వెంట్రుకల నిర్మాణాల వంటి గుంపులు ఉన్నట్టుగా తేలిందని ఆమె చెప్పారు. ఐతే, ఈ శిలాజ లక్షణాలన్నీ కాంబ్ జెల్లీని పోలి ఉన్నాయని, ఇది జెల్లీ ఫిష్‌కన్నా కూడా పురాతనమైందని షీ పేర్కొన్నారు.

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles