ఆదాయం పన్ను కొత్త ప్రతిపాదన ఎవరికెంత మేలు


Sat,February 9, 2019 01:55 AM

గత వారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను రిబేట్ అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారికి పెద్ద ఊరటనిచ్చింది. ఆర్థికమంత్రి పీయూష్‌గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఆదాయం ఉన్న వారందరికీ పన్ను రిబేట్‌ను ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదన చాలా మందిలో గందరగోళాన్ని సృష్టించింది. అందులోనూ శ్లాబులలో మార్పులు చేయలేదు. రిబేట్‌లోనే మార్పం తా. ఆదాయం పన్నుపై రిబేట్ అంటే సాధారణంగా ఒక నిర్ణీత మొత్తంపై రద్దు చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పన్ను రిబేట్ గరిష్ఠంగా రూ. 12,500. మీకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షలు ఉంటే చెల్లించాల్సి వచ్చే ఆదాయం పన్ను మొత్తానికి ఈ రిబేట్ సమానం. అన్ని ఆదాయ మార్గాల నుంచి వచ్చే ఆదాయం నుంచి అన్ని రకాల మినహాయింపులను తీసివేయగా వచ్చేదే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం. ఈ అంశాలన్నే మనం కొన్ని గణాంకాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
Tax

రూ. 5లక్షల లోపు మొత్తం ఆదాయం

అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయం రూ .5 లక్షలు అనుకుందాం. మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కూడా రూ. 5 లక్షల లోపే అనుకుందాం. అలాంటి సందర్భంలో కొత్త ప్రతిపాదనల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే దీనర్థం మీరు అసలు పొదుపు, మదుపు లేదా బీమా చేయరాదని అర్థం కాదు. జీవిత, ఆరోగ్య బీమా లేకుండా ఉండడం మీకుటుంబానికే ప్రమాదకరం. ఆదాయం ఎంత ఉన్నా సరే కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించండి. జీవిత బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోండి. జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి అనుగుణంగా సంపదను సృష్టించడానికి కొన్ని పొదుపు, మదుపులు తప్పనిసరి. జీరో ఆదాయం పన్ను స్థాయి ఆదాయంలో మీ మదుపు సాధనాలు కేవలం ఆదాయంపన్ను చట్టంలోని 80సీ, 80డీ వంటి సెక్షన్ల కింద పేర్కొన్న సాధానాలే కావాల్సిన అవసరం లేదు. జీరో టాక్స్ ఆదాయం ఉన్న వారికి ఈ కొత్త టాక్స్ రిబేట్ ఎలా వర్తిస్తుందో టేబుల్-1 చూడండి.

రూ. 5 నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉంటే..

మీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలకు పైబడి ఉన్నా సరే దాన్ని జీరో టాక్స్ పరిధిలోకి ఎలా తీసుకురావచ్చునో చూద్దాం. వివిధ పన్ను మినహాయింపు సాధనాల్లో పొదుపు లేదా మదుపు చేస్తూ పన్ను పరిధిలోకి వచ్చే తగ్గించవచ్చు. నిజానికి రూ. 10 లక్షల ఆదాయం ఉన్నా సరే చెల్లించాల్సిన పన్ను జీరో స్థాయికి ఎలా తీసుకురావచ్చునో చూద్దాం. అయితే ఈ గణాంకాలన్నీ మీకు లెక్కలేసి చూపించడానికి మాత్రమే. ఇందులో పేర్కొన్నవన్నీ గరిష్ఠస్థాయి పరిమితికి తీసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందులో మీకు సరిపోయే మినహాయింపులను మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని మినహాయింపులన్నింటినీ వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మీ ఆదాయం రూ. 10 లక్షలు ఉన్నా సరే చెల్లించాల్సిన పన్నును జీరో స్థాయికి తీసుకురావచ్చు. ఎలాగో టేబుల్ 2 లో చూడవచ్చు.

రూ. 10లక్షల పైగా ఆదాయం ఉంటే..

ఒకవేళ మీ ఆదాయం రూ. 10 లక్షలకు పైగా ఉంటే, మీ ఆదాయంలో కొంత భాగం 30 శాతం పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు అధిక పన్నును చెల్లించాల్సి రావచ్చు. జీరో పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. అయితే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని ఎంత తగ్గించగలిగితే పన్ను అంత తక్కువగా ఉంటుంది. రూ. 10లక్షలకు పైగా ఉన్న ఆదాయంపై పన్ను ఎలా వర్తిస్తుందో మూడో టేబుల్‌లో చూద్దాం.

మినహాయింపులను గరిష్టంగా పొందడం ఎలా?

చెల్లంచాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గించకోవడానికి ఆదాయం పన్ను చట్టంలో అనేక సెక్షన్లు అవకాశం కల్పిస్తున్నాయి. వాటిని సమర్దంగ వినియోగించుకోవడం వల్ల పన్నును తగ్గించుకోవచ్చు. 80సీ, 80డీ సెక్షన్ల కింద సాధారణంగా అందరూ గరిష్టంగా మదుపు, పొదుపు చేసి ఉపయోగించుకుంటారు. అవి కాక ఇంకా అనేక సెక్షన్లు ఉన్నాయి. అవి మీకు అవసరమైనప్పుడు ఆర్థిక సాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద ఎడ్యుకేషన్ రుణాలపై చెల్లించే వడ్డీపై మినహాయింపును పొందవచ్చు. అలాగే సెక్షన్ 80 డీడీ కింద అర్హతగల చారిటీలకు డోనేషన్ ఇవ్వడం వల్ల కూడా పన్ను మినహాయింపును పొందవచ్చు. పొదుపు, డిపాజిట్ అకౌంట్ల ద్వారా వడ్డీ ఆదాయం వస్తే దాన్ని సెక్షన్ 80 టీటీఏ, సెక్షన్ 80 టీటీబీ కింద మినహాయింపులు పొందవచ్చు. అయితే ఎంత ఆదాయానికి ఎలాంటి మినహాయింపు, ఎంతవరకు పొందవచ్చునో స్పష్టంగా తెలుసుకోవాలంటే మీ టాక్స్ ప్లానర్‌ను సంప్రదించాల్సిందే.

-అదిల్ శెట్టి
-సీఈఓ, బ్యాంక్ బజార్ డాట్ కామ్

Tax1

348
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles