ఆత్మైస్థెర్యం ముందు బరువెంత?


Mon,March 25, 2019 01:38 AM

అరబ్ దేశాల చరిత్రలో ఎన్నడూ లేనిది ప్రత్యేక ఒలింపిక్స్ జరిగాయి. ప్రత్యేక అంటే.. ప్రత్యేక అవసరాలుగల వారిలోఆత్మైస్థెర్యం నింపే పోటీలన్నమాట. వీటిల్లో మన దేశానికి చెందిన ఓ యువతి.. బంగారు పతకంతోపాటు.. అక్కడున్నవారందరి హృదయాలు గెలుచుకుంది.
manali
50 యేండ్ల చరిత్రలో ఎన్నడూ లేనిది అబుదాబీలో స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహించారు. ఈ క్రీడలు జరగడం ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేక ఒలింపిక్స్‌లో మహారాష్ట్ర నుంచి మనాలి మనోజ్ శేల్కే పాల్గొంది. ఈ పోటీల కోసం పవర్‌లిఫ్టింగ్‌లో ఎంతో శ్రమించింది మనాలి. తన ఏండ్ల సాకారమవుతుందనుకునే సమయానికి ఒక్కసారిగా ఆమెను భయం ఆవరించింది. ప్రేక్షకుల కోలాహలం చూసి భయపడింది. మొదటి రౌండ్ పవర్ లిఫ్టింగ్‌లో తడబడింది. ఒక్కసారిగా అంతా నిశబ్దం ఆవరించింది. ఇక రెండో రౌండ్‌కు సిద్ధమైనా మనాలి ముఖంలో తెలియని భయం అలాగే కొనసాగింది. రెండో రౌండ్‌లోను బరువు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అప్రమత్తమైన కోచ్.. ఆమె భయాన్ని తొలిగించి.. స్ఫూర్తిని రగిలించాడు. మూడో రౌండ్‌కు నిండైన ఆత్మవిశ్వాసంతో వచ్చిన మనాలి.. ఈజీగా బరువు ఎత్తి.. బంగారు పతకం అందుకుంది. అంతేకాకుండా అక్కడున్నవారంది హృదయాలను గెలుచుకుంది. స్ఫూర్తిదాయకమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ స్పెషల్ ఒలింపిక్స్‌లో మన దేశం నుంచి పాల్గొన్న క్రీడాకారులు 85 బంగారు, 154 రజత, 129 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

361
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles