ఆత్మవిశ్వాసపు స్వారీ!


Wed,September 12, 2018 12:34 AM

మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు బైక్ రైడింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు బెంగళూరు యువతులు. రోజువారీ పనులతో బిజీగా ఉంటూ సంసార జీవితంలో బందీలుగా ఉన్న వారికి ఇది ఆటవిడుపుగానే కాదు.. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని నిరూపిస్తున్నారు.
Ride
బెంగళూరుకు చెందిన రష్మీ, మలిని గౌరీశంకర్ నేతృత్వంలో బుల్లెట్ రైడింగ్ వర్క్‌షాప్ మొదలైంది. దాని పేరు ఎఫ్5 ఎస్కేప్స్. ఒకవైపు ఉద్యోగ ప్రయాణం.. మరోవైపు జీవిత ప్రయాణం చేస్తూ లైఫ్ బోరింగ్‌గా మారిందనుకొనే వాళ్లను ఈ రైడ్‌కు ఆహ్వానిస్తున్నారు. వీరంతా బెంగళూరు అడ్వెంచర్‌ను ఆస్వాదిస్తున్నారు. 14 మందితో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్ ప్రస్తుతం ఐదవ ఎడిషన్ నడుస్తున్నది. 101 మంది మహిళలు దీనిలో పాల్గొన్నారు. ఉంటే ఇంట్లో.. లేకపోతే ఆఫీసుల్లో.. కనీసం హాయిగా బైక్ నడుపుతూ దానిని ఆస్వాదించే స్వేచ్ఛ.. తీరిక మహిళలకు లేకపోవడంతో లైఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. అలాంటి వారిని ఉత్సాహ పరిచేందుకు ఎఫ్5 ఎస్కేప్స్ మోటర్‌బైకింగ్ వర్క్‌షాప్ ఉపయోగపడుతుందనీ, సాహసాలు అలవాటు అవుతాయని నిర్వహకులు చెప్తున్నారు.

238
Tags

More News

VIRAL NEWS