ఆటో ఇమ్యూన్ సమస్యలకు హోమియో బెస్ట్


Wed,March 9, 2016 12:11 AM

శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ బయటి నుంచి వచ్చే వ్యాధి కారకాలతో పోరాడుతుంది. ఒక్కోసారి ఈ రక్షణ వ్యవస్థ ఎక్కువ చురుకుగా ఉండి శరీర కణాల మీదే దాడి చేస్తుంది. అలాంటి సమస్యలను ఆటో ఇమ్యూన్ ఆరోగ్య సమస్యలు అంటారు. ఇలాంటి వాటిలో థైరాయిడ్ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్లమచ్చలు, సొరియాసిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అందుకే వీటిని ఆటో ఇమ్యూన్ వ్యాధులంటారు. థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్లమచ్చలు, రక్త హీనత, కండరాల నొప్పులు, చర్మ సమస్యలు, ల్యూపస్, కిడ్నీ సమస్యలు, ఎడిసన్స్ డిసీజ్, సొరియాసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది స్త్రీలు వ్యాధుల బారిన పడుతుంటారు.

కారణాలు


-బ్యాక్టీరియా, వైరస్, కెమికల్స్, వాతావరణ కాలుష్యం
-వంశపారంపర్యంగా కూడా ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు


-కండరాల నొప్పి, నీరసం, జ్వరం, అలసట, కీళ్ల నొప్పులు, చర్మం, రక్తకణాలు, రక్త నాళాల వంటి భాగాలు ఎక్కువగా ప్రభావానికి లోనవుతాయి.
-వ్యాధి నిర్ధారణ, ఆటో యాంటీ బాడీస్ టెస్ట్‌లు
-సీ రియాక్టివ్ ప్రొటీన్ టెస్ట్‌లు
-ఈఎస్‌ఆర్, సీబీపీ
-ఎరిత్రోసైట్ సెడిమెనేటిన్ రేట్
-కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు
-రుమటాయిడ్ ఆర్థరైటిస్ - ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవక్రియలలో ఏర్పడే అసమతుల్యత వల్ల తలెత్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్, శరీరంలో రెండు వైపులా సమానంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురి వావడం వాటి కదలికలు పూర్తిగా స్థంభించడం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా కీళ్లు వైకల్యానికి గురి కావడం జగుతుంది. కీళ్ల నొప్పులు, వాపు, కీళ్లు పట్టేయడం. రక్షణ వ్యవస్థ మోకాలి సైనోవియం అనే పొరపై పనిచేసే వాపు వస్తుంది. కీళ్లు మాత్రమే కాకుండా కాళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది.

సొరియాసిస్


సొరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వాధి. ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. ఇది పొలుసుల మాదిరిగా వచ్చే చర్మ వ్యాధి. దురద, ఎర్రమచ్చలు శరీరమంతా వ్యాపిస్తాయి. సొరియాసిస్ మచ్చలు ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరిచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు భాగాల్లో ఎక్వుగా కనిపిస్తుంది.

లక్షణాలు


-చర్మం ఎర్రబారడం, జట్టు రాలడం, కీళ్ల నొప్పులు,చర్మం పొడిబారినపుడు చర్మం పై పగుళ్లు ఏర్పడడం వల్ల రక్త స్రావం అవుతుంది.
-నిర్థారణ పరీక్షలు- స్కిన్ బయాప్సి, సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్‌రే
-సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమెటస్
ఈ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక అవయవాలు వ్యాధుల భారిన పడుతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది 15 నుంచి 35 సంవత్సరాల వయసున్న స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొద్ది రోజులు తీవ్రంగా, మరికొద్ది రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ అయి కనిపిస్తుంది. జన్యు పరమైన, పర్యావరణ కారకాలు, మానసిక ఒత్తిడి వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు


ముఖ చర్మం పై దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడడం, పొలుసులు రావడం, చర్మం పై నల్లని మచ్చలు వస్తాయి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, శరీరమంతా వాపులు రావడం, బరువు పెరగడం, ఎస్‌ఎల్‌ఇ దీర్థకాలంలో మూత్ర పిండాలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.

హోమియో చికిత్స


హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, మానసిక, శారీరక స్థితిగతులు, ఆహార విహారాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నింటికీ హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పరిరక్షణలో చికిత్స తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌ను సమూలంగా నయం చేయవచ్చు. వ్యాధి మూలలకు చికిత్స చేస్తూ వ్యాధి తిరగబడకుండా చికిత్స చేయడం హోమియోపతి యొక్క ప్రధాన్యం.

2018
Tags

More News

VIRAL NEWS