ఆటో ఇమ్యూన్ వ్యాధులకు చెక్


Wed,May 11, 2016 12:55 AM

శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడడానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ వ్యాధి కారకాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్లమచ్చలు, సొరియాసిస్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, చర్మ సమస్యలు, ల్యూపస్‌ఎరిథమెటిస్, కిడ్నీ సమస్యలు, ఎడిసన్స్ డిసీజ్, పల్మనరీ థ్రాంబోసిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అందుకే వీటిని ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. స్త్రీలలో దాదాపు 75 శాతం మంది ఈ వ్యాధుల బారిన పడుతుంటారు.


కారణాలు


బ్యాక్టీరియా, వైరస్, కెమికల్స్, వాతావరణ కాలుష్యం
వంశపారంపర్యంగా కూడా ఇది వచ్చే అవకాశం ఎక్కువ

లక్షణాలు


కండరాల నొప్పి, నీరసం, జ్వరం, అలసట
కీళ్ల నొప్పులు, చర్మం, రక్తకణాలు
రక్తనాళాల వంటి భాగాలు ఎక్కువ ప్రభావితమవుతాయి.

వ్యాధి నిర్ధారణ


ఆటో యాంటీ బాడీస్ పరీక్షలు
సీరియాక్టివ్ ప్రొటీన్, ఈఎస్‌ఆర్, సీబీపీ
ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ - జీవక్రియలలో ఏర్పడే అసమతుల్యత వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ సమస్య. కీళ్లలో తీవ్రమైన వాపు రావడం వల్ల వాటిలో కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడ్ సమస్యలు- యాంటీ బాడీస్ థైరాయిడ్ గ్రంథికి వ్యాపిస్తాయి. దీనికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. థైరాయిడ్ గ్రంథి దెబ్బతినడం వల్ల హైపోథైరాయిడిజం రావచ్చు. దీనిని గ్రేవ్స్ డిసీజ్ అంటారు. మలబద్ధకం, డిప్రెషన్, నీరసం, అలసట, జుట్టు రాలటం, గోళ్లు విరగడం, కాళ్లు, చేతులు వాయడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీ3,టి4, టీఎస్‌హెచ్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, సీబీసీ, ఎల్‌ఎస్‌టీ, ప్రొలాక్టిన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.
సొరియాసిస్ - సొరియాసిస్ దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. దురద, ఎర్రమచ్చలు శరీరమంతా వ్యాపిస్తాయి. ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, పొట్ట, మెడ, నుదురు చెవుల భాగాల్లో కనిస్తుంది. చర్మం ఎర్రగా మారడం, జట్టు రాలిపోవడం, కీళ్లనొప్పులు, చర్మం పొడిబారడం, పగుళ్లు రావడంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. స్కిన్ బయాప్సీ, ఈఎస్‌ఆర్, ఎక్స్‌రే పరీక్షలు అవసరమవుతాయి.

సిమ్టమిక్ ల్యూపస్ ఎరిథమెటిస్ (ఎస్‌ఎల్‌ఈ)- ఎస్‌ఎల్‌ఈ సమస్య వల్ల శరీరంలో చాలా భాగాలు వ్యాధుల బారిన పడతాయి. ఇది తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది 15 -35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. జన్యుపరమైన కారణాలు, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. ముఖ చర్మం పై దద్దుర్లు రావడం, పొలుసులు రావడం, చర్మం పై నల్లని మచ్చలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, శరీరమంతా వాపులు రావడం, బరవు పెరగడం, ఎస్‌ఎల్‌ఈ దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీయవచ్చు. సీబీపీ, ఈఎస్‌ఆర్, సీయూఈ, సీఆర్‌పీ, యాంటీ డీవీఎస్ - డీఎన్‌ఏ, యాంటీ ఎస్‌ఎమ్ యాంటీ బాడీస్, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

హోమియో చికిత్స


హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, మానసిక, శారీరక స్థితిగతులు, ఆహార విహారాలను పరిగణనలోకి తీసుకొని చికిత్సను ఆమోదించడం జరుగుతుంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నింటికీ హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది అనుభజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఆటోఇమ్యూన్ వ్యాధులను సమూలంగా నయం చేయవచ్చు. శరీరంలోని నిరోధక వ్యవస్థను పటిష్టపరచడం, వ్యాధి మూలాలకు చికిత్స చేస్తూ వ్యాధి తిరగబడకుండా చికిత్స చేయడం హోమియోపతి ప్రధాన లక్ష్యం.
murali

1724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles