ఆకాశహర్మ్యాలకు ఫోమ్‌వర్క్


Sat,March 2, 2019 12:25 AM

ఒక్కసారి పశ్చిమ హైదరాబాద్‌లోకి అడుగుపెడితే చాలు.. కళ్లు మిరుమిట్లు గొలిపే ఆకాశహర్మ్యాలే దర్శనమిస్తాయి. నిన్నటివరకూ ఐదు నుంచి పది అంతస్తుల భవనాలే ఎక్కువగా కనిపించేవి. కానీ, నేడో.. పన్నెండు నుంచి ఇరవై అంతస్తుల్లోపు అపార్టుమెంట్లను నిర్మించడం సర్వసాధారణమైంది. వీటికి కొనుగోలుదారుల నుంచి ఆదరణ పెరగడంతో.. నిర్మాణ సంస్థలూ వీటికే సై అంటున్నాయి. అసాధ్యమనుకున్న ఆకాశహర్మ్యాలను సుసాధ్యం అవ్వడానికి ప్రధాన కారణం.. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడమే. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్తమ నిర్మాణ ప్రమాణాల్ని హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలు ప్రవేశపెట్టాయి. ఇందులో ప్రధానమైనది.. ఫోమ్ వర్క్ టెక్నాలజీ.
ALLUMINIUM-FORMWORK
విశ్వనగరాల్లో ఇరవై, ముప్పయ్ అంతస్తుల నివాస సముదాయాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. పెరిగే జనాభా, అధికమయ్యే వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తారు. సరిగ్గా, అదే రీతిలో మన వద్ద బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మించే సంస్థల సంఖ్య పెరిగింది. ఊహించిన దానికంటే అధిక వేగంతో నిర్మాణాల్ని పూర్తి చేసే అవకాశం ఉండటంతో డెవలపర్లు ఫోమ్ వర్క్ టెక్నాలజీ వైపు దృష్టి సారిస్తున్నారు. నిర్మాణం నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది. నిర్మాణ సమయంలోనూ భద్రత గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.

ఫోమ్ వర్క్ పరిజ్ఞానం సాయంతో ఆకాశహర్మ్యాలను నిర్మించాలని కోరుకునేవారు.. ైక్లెంబింగ్ ఫోమ్‌వర్క్ ఎంచుకోవడం మేలని నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. హైడ్రాలిక్ లేదా ఎలక్ట్రిక్ జాక్‌లతో ఇవి పని చేస్తాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఇరవై లేదా అంతకంటే అధిక ఎత్తు గల నిర్మాణాల్లో వీటిని విరివిగా వినియోగించొచ్చు. ఎందుకంటే, ఫోమ్ వర్క్‌ను స్టీలుతో తయారు చేస్తారు. ఈ ఫ్రేముకు కాంక్రీటు ఫోమ్ ప్యానెళ్లను జతచేస్తారు. వీటిలో కొన్ని రోల్లర్ల మీద సపోర్టుగా పెడతారు. సిమెంటును కాంక్రీటును గోడల్లో పోసిన తర్వాత.. వాటంతట అవే గోడల నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఈ విధానంలో మూడు నుంచి ఐదు రోజుల్లో ఒక శ్లాబు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి, ఫోమ్ వర్క్ పరిజ్ఞానం హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణాలను పెంచేందుకు దోహదపడుతున్నది.

526
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles