ఆకలి తీరుస్తున్న ఆలోచన


Thu,January 17, 2019 01:56 AM

హంగు ఆర్భాటాలతో జరిగే ఓ పెండ్లి వేడుకకు వెళ్లింది. అక్కడ కనిపించిన ఓ దృశ్యం ఆమెను బాధించింది. అక్కడ ఓ ఆలోచన పుట్టింది. అది ఆమెను మార్చేసింది. ఇప్పుడు వందల మంది ఆకలిని తీరుస్తున్నది.
taira
తైరా భార్గవ.. బడికి వెళ్లి పాఠాలు నేర్చుకునే విద్యార్థి. ఆమె సొంత ఆలోచనతో ఇప్పుడు ఢిల్లీలో ఒక ప్రాజెక్టును చేపట్టింది. దానికి ప్రాజెక్ట్ డబుల్ రోటి అని పేరు పెట్టింది. ఆకలితో ఉన్న వాళ్ల జాడ తెలుసుకుని వాళ్ల ఆకలి తీర్చడమే ఆమె చేస్తున్న పని. ఇలా వారానికి సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి తైరా ఆహారాన్ని అందిస్తున్నది. పెళ్లి వేడుకలో మిగిలిన ఆహారాన్ని వృథాగా పడేయడమే ఆమె చూసిన దృశ్యం. ఆ ఘటన ఆమెను బాధించింది. దేశంలో సరైన పౌష్టికాహారం, తినడానికి తిండి లేక ఎంతో మంది అలమటిస్తున్నారని తెలుసుకున్నది. మరోవైపు సరైన ఆహారం ఉన్నా అది అవసరమైన వారికి అందటం లేదని తెలుసుకున్నది. హోటళ్లలో, బేకరీలలో వృథా చేస్తున్న నాణ్యమైన ఆహారాన్ని సేకరించాలనుకుంది. తనకు తెలిసిన బేకరీ వాళ్లతో మాట్లాడి వృథా చేస్తున్న తిను బండారాలను సేకరించి పేదవాళ్లకు అందిస్తుంది. ముఖ్యంగా బేకరీల నుంచి వచ్చే బ్రెడ్‌ను వృథా చేయకుండా వారానికి నాలుగు వందల మంది పిల్లలకు, పెద్దలకు అందిస్తుంది. దీనికి అవసరమయ్యే రవాణా చార్జీలను సొంతంగా భరిస్తుంది. ముందు ముందు ఎవరైనా ప్రోత్సాహమందిస్తే, సహకారం పెరిగితే మరింత ఎక్కువ మందికి ఆహారాన్ని అందిస్తానంటున్నది.

906
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles