ఆకర్షణీయ చిట్కాలు


Wed,January 30, 2019 01:40 AM

భారతీయ గృహాలంకరణ అంటే తేలికైన పనికాదు. ఇంటి అలంకరణ ఎలా ఉండాలనేది ఊహించటం తేలికే కాని అభిరుచులకు తగ్గట్టు ఆమర్చుకోవడం కష్టమే. ఇంటి అలంకరణకు ఏఏ వస్తువులు ఉంటే బాగుంటాయో చూద్దాం.
house
-చక్కటి అభయాన్నిచ్చే గణేశ విగ్రహం లేకుంటే ఇంటి అలంకరణ ఎంత చేసినా చేయనట్లే. వీలైనంత వరకు గణేశ విగ్రహాన్ని పూజగదిలో ఉంచండి. లేదంటే హాల్‌లో శుభ సూచకంగా బాగానే ఉంటుంది. వినాయక విగ్రహాన్ని నచ్చిన మెటీరియల్స్‌తో చేయించుకోవచ్చు. గది సైజును బట్టి ఎంచుకోండి.
-గతంలో తులసి మొక్క ఇంటి పెరటిలో ఉండేది. ఇప్పుడంత ప్రదేశం ఉండట్లేదు కాబట్టి బాల్కనీలో పెట్టేస్తున్నారు. దీన్నే ఇంటి ముందు భాగంలో ఆకర్షణీయమైన కుండీలో తులసి మొక్కను ఉంచండి. దాని ముందు దీపం పెడితే చూడ్డానికి సంప్రదాయకంగా ఉంటుంది.
-సాధారణంగా ఇంట్లో సోఫాల కంటే నేలపై కూర్చోవడానికే ఇష్టపడుతుంటారు. ఆకర్షణీయమైన మేట్రెస్ వేసి దానిపై వివిధ రంగు డిజైన్‌లతో కూడిన కుషన్లను ఇంటికొచ్చిన అతిథులు కూర్చునేందుకు సౌకర్యం కల్పిస్తే చక్కగా ఉంటుంది.
-నటరాజ విగ్రహం ఎప్పటికి నూతనత్వాన్ని ఇస్తుంది. ఇత్తడి నటరాజ విగ్రహాన్ని ఇంటికి వచ్చిన వారికి బాగా కనపడేలా అమర్చండి.
-ఆకర్షణీయమైన రంగులతో చేసిన కృష్ణుడి విగ్రహం ఏ ఇంటికైనా సరే చక్కటి అందాన్నిస్తుంది. దీన్ని ఇంటిలోని ఏ ప్రదేశంలో ఉంచినా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

562
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles