ఆంజియోప్లాస్టీ సంగతులు...


Wed,November 19, 2014 02:22 AM

ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి?

రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టంట్ వెయడాన్ని ఆంజియో ప్లాస్టీ అంటారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు.

stent

కరోనరీ ఆంజియోప్లాస్టీ అంటే?


శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే గుండెకు కూడా నిరంతర రక్త ప్రసరణ అవసరమవుతుంది. ఇలా గుండెకు రక్తప్రసరణకు ఉపయోగపడే రక్తనాళాలలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ రక్తనాళాలలో ఏర్పడిన బ్లాకేజీలను తొలగించడానికి చేసే ఆంజియో ప్లాస్టీనీ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు.

కరోనరీ ఆంజియోప్లాస్టీ ఎన్ని రకాలు?


కరోనరీ ఆంజియోప్లాస్టీ ఉపయోగించిన స్టంట్, బెలూన్‌ను బట్టి మూడు రకాలు. 1 ప్లెయిన్ బెలూన్ యాంజియోప్లాస్టీ, 2 యాంజియోప్లాస్టీ విత్ స్టంట్‌ఇ ఇంప్లాంటేషన్, 3యాంజియో విత్ డ్రగ్ ఎల్యూటింగ్‌బలూన్
ప్లెయిన్ బలూన్ ఆంజియోప్లాస్టీ(పోబా) అంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది?
ఈ విధానంలో కేవలం బెలూన్ డైలేషన్‌ను మాత్రమే ఉపయోగిస్తారు, ఎలాంటి స్టంట్‌ను వాడరు. పోబా చెయ్యాలంటే రక్తనాళాలల్లో ఉన్న బ్లాకేజిలు 2-2.25 మిల్లీమీటర్లు మాత్రమే ఉన్నపుడు మాత్రమే సాధ్యమవుతుంది. పోలో స్టంట్‌తో ఎక్కువ లాభం ఉండదు.

ఆంజియోప్లాస్టీ విత్ స్టంట్ ఇంప్లాంటేషన్ అంటే ఏమిటి ? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది?


ఈ పద్ధతిలో రక్తనాళాలలో బ్లాకేజిని తొలగించడానికి స్టంట్‌ను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో అత్యంత విరివిగా ఉపయోగిస్తున్న యాంజియోప్లాస్టీ ఇది. 2.25 మిల్లీమీటర్ల కంటే పెద్ద బ్లాకేజి ఉన్నపుడు తప్పనిసరిగా యాంజియోప్లాస్టీలో స్టంట్ ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆంజీయోప్లాస్టీ విత్ డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ అంటే ఏమిటి?


ఈ విధానంలో కూడా స్టంట్ ఉపయోగించరు కానీ మందు విడుదల చేసే బెలూన్‌ను ఉపయోగిస్తారు. ఇప్పటికే స్టంట్ ఉపయోగించిన వారికి ఈ విధానం ఉపయోగిస్తారు.

ఆంజియోప్లాస్టీ ఎలా చేస్తారు?


ఆంజియోప్లాస్టీ అన్ని సౌకర్యాలు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్న క్యాథ్‌ల్యాబ్ ఉన్న హాస్పిటల్స్‌లో మాత్రమే చేస్తారు. ఇది ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ కలిగిన నిపుణుల బృందం ఆధ్వరయంలో చేస్తారు. ఈ బృందంలో ఒక కార్డియాక్ నర్స్, టెక్నిషియన్, ఒక కార్డియాక్ ఆనస్థటిస్ట్ ఉంటారు.

ఆంజియోప్లాస్టీ ఎప్పుడు అవసరమవుతుంది?


ఆంటిజయోగ్రామ్‌లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్టు నిర్ధారణ జరిగిన వారికి ఆంజియోప్లాస్టీ అవసరమవుతుంది. ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో, బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లేదా హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ చేస్తారు. రక్తనాళాల్లో బ్లాకేజి 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి చేస్తారు. 50-70 శాతం లోపు ఉన్నట్టయితే మాత్రం ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.

sharath

అన్నీ ఆంజియోప్లాస్టీలకు పట్టే సమయం, చేసే విధానం ఒకేవిధంగా ఉంటుందా?


ప్రైమరీ ఆంజీయోప్లాస్టీలు ఎమర్జెన్సీలలో చేస్తారు. లక్షణాలు, సమస్య తీవ్రతను అనుసరించి గుండె కండరాలు ఎంత బలహీన పడిఉన్నాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఛాతిలో నొప్పి , శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి లక్షణాలు ఉన్నపుడు వ్యాధి ఎంత తీవ్రంగాఉన్నదాని మీద ఆధారపడి ఆంజియోప్లాస్టీకి ప్లాన్ చెయ్యాల్సి ఉంటుంది.

స్టంట్స్ ఎన్ని రకాలు?


స్టంట్స్ సాధారణంగా రెండు రకాలు. 1 బేర్ మెటల్ స్టంట్స్, 2 డ్రగ్ ఇల్యూటింగ్ స్టంట్స్. బేర్ మెటల్ స్టంట్స్‌లో కేవలం మెటాలిక్ ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది. డ్రగ్ ఇల్యూటింగ్ స్టంట్స్ లో తిరిగి బ్లాకేజ్ ఏర్పడకుండా మందుతో కోటింగ్ చేసి ఉంటుంది.

6048
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles