ఆంకిలోసింగ్ స్పాండిలోసిస్‌కు హోమియో


Tue,September 13, 2016 11:13 PM

spine
మన శరీరంలోని రక్షణ వ్యవస్థ శరీరాన్ని సూక్ష్మ క్రిముల నుంచి జబ్బుల నుంచి నిత్యం కాపాడుతుంటుంది. ఒక్కోసారి అది మన శరీరం మీద దాడి చేస్తుంది. దీని ఫలితమే రకరకాల ఆటోఇమ్యూన్ సమస్యలు. ఈ కోవకు చెందినదే ఆంకిలోసింగ్ స్పాన్‌డిలైటిస్ సాధారణంగా వెన్ను సమస్యలు, వెన్ను పూసలు అరిగిపోవడం, వాటి మధ్యలో ఉండే డిస్కులు దెబ్బతినడం వల్ల వస్తాయి. కానీ ఈ సమస్య మాత్రం మనలోని రోగనిరోధక వ్యవస్థ వెన్నుదగ్గర కణజాలంపై దాడి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంఇ. ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్ చేత వెన్నెముక బిరుసుగా మారడాన్ని ఆంకిలోసింగ్ సాండిలైటిస్ అంటారు. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారిలోను, అందులోనూ స్త్రీల కంటే పురుషులలో 3 రెట్లు ఎక్కువగా చూడవచ్చు.

వెన్నెముక నిర్మాణం చాలా సంక్లిష్టమైంది. డిస్కులు, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు కార్టిలేజ్‌ల సముదాయంతో ఏర్పడుతుంది. మనిషి వంగడానికి మరియు ఇతర కదలికలకు తోడ్పడుతుంది. ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ గ్రూప్‌కి చెందినది. వీటిని సరో నెగెటివ్ స్పాండైలో ఆర్థ్రోపతిన్ అని అంటారు. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ఫైబ్రోసిస్ కి గురి అవుతుందో లేదా వెన్నెముక అసాధాణంగా పెరిగి ఒకదినికొకటి కలిసిపోవడం జరుగుతుందో అప్పుడు వెన్నెముక తన సహజ కదలికలను కోల్పోయి గట్టిగా బొంగు కర్రలా తయారవుతుంది. దీనినే బాంబుస్పైన అని అంటారు.

కారణాలు
సాధారణం నుంచి అతిత్రీవ్రస్థాయి వరకు నడుము, తుంటి కీళ్లు మరియు పిరుదులలో నొప్పి ఉండవచ్చు.
వెన్నెముక లోని వెన్నుపూసలు ఒకదానికొకటి కలిసిపోవడం ద్వారా నడుము, తుంటి మరియు మెడ భాగములు బిగువుగా మారి సాధారణ కదలికలకు ఆటంకం కలుగుతుంది. ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ కేవలం వెన్నెముకకు మాత్రమే కాకుండా కాళ్లు, చేతులలోని కీళ్లు, గుండె కవాటాలు, ఊపరితిత్తులపైన కూడా ప్రభావం చూపిస్తుంది.

40 శాతం ఈ సమస్యతో బాధపడే వారిలో కంటికి సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా కళ్లు ఎర్రగామారడం, మంట, వెలుతులు చూడలేకపోవడం, కొన్ని సందర్భాలలో కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు జ్వరం, నీరసం, ఆకలి తగ్గడం వంటి లక్షనాలు చూడవచ్చు.

నిర్ధారణ పరీక్షలు


రోగి లక్షణాలను బట్టి మరియు సీబీపీ, ఈఎస్‌ఆర్, సి రియాక్వివ్ ప్రొటీన్, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, హెచ్‌ఎల్‌ఏబీ 27 పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.

spine1

దుష్ఫలితాలు


వెన్నుపూసలు ఆస్టియోపొరోసిస్‌కు గురి కావడం వల్ల వెన్నెముక ఫ్యాక్చర్లు సంభవిస్తాయి.
ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో వెన్నెముక లోనుంచి వచ్చే నరాలు ఒత్తిడికి లోనవడం వల్ల కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లుగా ఉండడం సత్తువకోల్లోపవడం వంటి లక్షణాలకు దారి తీస్తాయి.ఈ సమస్య ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.

హోమియోకేర్ చిక్తిత్స


ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించిన వెంటనే వైద్యం చేయడం ద్వారా వెన్నెముక పాడవకుండా కాపాడవచ్చు. హోమియోవైద్య విధానం ద్వారా కేవలం వ్యాధి లక్షణాలు అయిన నొప్పి, తిమ్మిరి, మంటలు తగ్గించటమే కాకండా మూల కారణాన్ని గుర్తించి చిక్తిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంది. హోమియోపతి మందులు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్రమపరిచే విధంగా పనిచేయడం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడవచ్చు.

1689
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles