అసిస్టెంట్ జీతం రూ.26 లక్షలు!


Sat,April 13, 2019 11:01 PM

ఆస్ట్రేలియాకి చెందిన ఈ ధనవంతుడు అసిస్టెంట్ కోసం వెతుకుతున్నాడు. అసిస్టెంట్ అంటే ఆఫీసు వర్క్ కాదండోయ్. ఈయన ప్రపంచం మొత్తం తిరగడానికి తోడుండాలి. సరదాగా నవ్విస్తూ.. అడిగిన వాటికి టక్కున సమాధానం చెప్పే వారు ఎవరైనా పర్వాలేదంటున్నారు. మరీ జీతం ఎంతో తెలుసా?
lepre
ఈ ధనవంతుడు పేరు మాథ్యూ లెప్రే. ఇతగాడి వయసు 26 యేండ్లు. లెప్రేకు ప్రపంచం మొత్తం తిరగాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఒక్కడే వెళ్తే ఏం బాగుంటుంది! పక్కన తోడుంటే కలిసి తిరగొచ్చు. టూర్ ఎంజాయ్ చెయ్యొచ్చు అనేది ఇతడి ఆలోచన. అందుకు ఒక అసిస్టెంట్ ఉంటే బాగుండు అనుకున్నాడు లెప్రే. అనుకున్నదే తడువుగా సరదాగా ఉంటూ, చెప్పిన పనులు చేసే అసిస్టెంట్ కావాలి అంటూ ఓ ప్రకటన కూడా ఇచ్చేశాడు. తన టూర్ మొత్తం తోడుగా ఉన్నందుకు దాదాపు 26 లక్షల రూపాయల జీతం కూడా ఇస్తానని ప్రకటించాడు. అనుభవం ఉన్నవారికి కొంత ఎక్కువగా జీతం ఉంటుందని, లింగ భేదాలు లేవని లెప్రే ప్రకటించాడు. ఇక ప్రయాణంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఖర్చంతా లిప్రేనే పెట్టుకుంటాడు. దీంతో 40 వేలమందికి పైగా ఆ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 25శాతం మంది అబ్బాయిలు కాగా.. 75 శాతం మంది అమ్మాయిలు కావడం విశేషం. ఇక పనిలో పనిగా మరికొంత మంది పెండ్లి ప్రపోజల్ కూడా పంపారు. ఇంత మంచి అవకాశాన్ని ఎవరు చేజిక్కించుకుంటారో చూడాలి.

331
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles