అవివాహితులకు సెలవులు!


Thu,February 7, 2019 01:29 AM

కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను మరింత సమయం పనిచేయించుకోవాలని చూస్తుంటాయి. కానీ చైనాలో మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే పెండ్లి కాకుండా ఉన్న మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇస్తున్నాయి. అంతేకాదు త్వరగా పెండ్లి చేసుకొని.. పిల్లలను కనమంటూ ప్రోత్సహిస్తున్నాయి కూడా.
single-women
పలు సంస్థలు తమ సంస్థలో పనిచేస్తున మహిళా ఉద్యోగినులకు పెండ్లి, ప్రసూతి సెలవులు ఇవ్వడమే గగనం. ఇక పెండ్లి కాకపోతే వారితో ఎక్కువ పని కూడా చేయించుకుంటాయి. కానీ చైనాలోని కొన్ని కంపెనీలు తమ తీరు మార్చుకున్నాయి. పెండ్లి కాని యువతులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. పెండ్లి కాని యువతులు తన జోడీని వెతుక్కునేందుకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తున్నాయి. వీటినే అక్కడ డేటింగ్ లీవ్స్ అంటున్నారు. ఎందుకంటే చైనాలో 2013 నుంచి పెండ్లిళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. 30 యేండ్లు దాటిన యువతులకు వివాహం కావడం చాలా కష్టంగా మారింది. వివాహం ఆలస్యం అవ్వడం వల్ల చైనాలో సంతానోత్పత్తి రేటు మరింతగా పడిపోయింది. 2013 నుంచి ఇప్పటి వరకు రెండువందల మిలియన్ల మంది చైనాలో పెండ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయారు. అందుకే ఈ డేటింగ్ లీవ్స్. పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు కూడా తమ భాగస్వామితో గడిపేందుకు నెలకు అదనంగా రెండు రోజులు సెలవులు ఇస్తున్నాయి.

239
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles