అవసరమే అన్నీ నేర్పింది..


Mon,February 25, 2019 01:18 AM

ఆరు గంటలు కరెంటు పోయింది సోలార్ విధానానికి మారారు..రసాయన ఆహారం తినీ తినీ చిరాకు లేసింది.. ఆర్గానిక్‌కు బాటలు వేశారు..నీటి సమస్య పలుకరించింది, ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు...
rajesh-vallari
బెంగళూర్‌కి చెందిన రాజేశ్, వల్లారి సాహూ దంపతులు.. పెద్ద చదువులు చదువుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చారు. అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా వారి మనసు అంగీకరించక బెంగళూర్ వచ్చి స్థిరపడ్డారు. ఒకరోజు కరెంట్ పోయింది. సుమారు ఆరు గంటల తర్వాత ఒక్కసారిగా హై వోల్టెజ్ పవర్ వచ్చింది. దీంతో ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ బ్రేక్ డౌన్ అయ్యాయి. తీవ్రనష్టపోయిన వల్లారి దంపతులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచించారు. సోలార్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. వెంటనే 3 కేవీలు కలిగిన 18 సోలార్ ప్యానల్స్‌ను ఇంటి చుట్టూ అమర్చారు. కరెంట్ సమస్యకు చెక్ పడింది. దీంతో పాటు వల్లారి కుటుంబం శాఖాహార కుటుంబం. అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవడానికి సొంతంగా కూరగాయలను సాగు చేయాలనుకున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న కొద్దిపాటి ఖాళీస్థలంలో పూర్తిగా ఆర్గానిక్ ఆకుకూరలు కాయగూరలు పెంచడం ప్రారంభించారు.

ఆర్గానిక్ ఆకుకూరలు, పండ్లు సాగుకు సర్వం సిద్ధం చేశారు. మొక్కల సాగుకు రోజుకు 250 లీటర్ల నీరు కావాలి. ఇది సమస్యగా మారింది. రాజేశ్ వాటర్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అనుభవంతో వర్షం నీటిని ఆదా చేసి భవిష్యత్‌లో వాడుకునేందుకు ప్రణాళిక వేశాడు. దీంతో మొక్కల కోసం వర్షపు నీటిని ఒడిసి పట్టి 30వేల లీటర్ల చొప్పున నీటిని మూడు ట్యాంక్‌ల్లోకి చేరేలా చేశాడు. ఈ మూడు ట్యాంకుల నీరు తొమ్మిది నెలలకు సరిపోతుంది. ఇలా ప్రస్తుతం 80 శాతం ఆర్గానిక్ పండ్లు, ఆకుకూరలు పండిస్తున్నారీ దంపతులు. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి, వాతావరణానికి వాళ్ల వంతు సాయంగా ఎక్కడికైనా వెళ్లాలంటే సాధ్యమైనంతవరకు సైకిళ్లపై, లేదా నడక ద్వారా వెళ్లడం, ప్రభుత్వ బస్సులను ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles